SA vs BAN: కావ్య పాప పోరడు ఇరగదీసిండు.. లో స్కోరింగ్‌లో బంగ్లాకు బిగ్ షాకిచ్చిన బ్యాడ్ లక్ టీం..

|

Jun 11, 2024 | 6:36 AM

South Africa vs Bangladesh, 21st Match, Group D Match Result: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 ( ICC Mens T20 World Cup 2024) 21వ మ్యాచ్‌లోనూ చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ హోరాహోరీ పోరులో బంగ్లాదేశ్ జట్టు (South Africa vs Bangladesh)దక్షిణాఫ్రికా బౌలర్లకు తలొగ్గింది. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 4 పరుగుల తేడాతో ఓడించింది.

SA vs BAN: కావ్య పాప పోరడు ఇరగదీసిండు.. లో స్కోరింగ్‌లో బంగ్లాకు బిగ్ షాకిచ్చిన బ్యాడ్ లక్ టీం..
South Africa Vs Bangladesh
Follow us on

South Africa vs Bangladesh, 21st Match, Group D Match Result: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 ( ICC Mens T20 World Cup 2024) 21వ మ్యాచ్‌లోనూ చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ హోరాహోరీ పోరులో బంగ్లాదేశ్ జట్టు (South Africa vs Bangladesh)దక్షిణాఫ్రికా బౌలర్లకు తలొగ్గింది. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మరో లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 4 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోరు నమోదు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. చివర్లో సొంత తప్పిదాల వల్లే మ్యాచ్‌లో ఓడిపోయింది.

క్లాసెన్ ఒంటరి పోరాటం..

టాస్ గెలిచి దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగిలిన వారిలో ఇద్దరు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ముగ్గురూ ఒకే పరుగుతో సరిపెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా తరపున హెన్రిక్ క్లాసెన్ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. క్లాసెన్ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ 29 పరుగులు చేశాడు. క్లాసెన్, మిల్లర్ ఇద్దరూ ఐదో వికెట్‌కు 80 బంతుల్లో 79 పరుగులు జోడించారు. తద్వారా దక్షిణాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది.

మరోసారి లో స్కోరింగ్ ఉత్కంఠ..

మిగతా జట్టులో క్విటన్ డి కాక్ 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రిజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్ ఖాతా తెరవలేకపోయారు. కెప్టెన్ ఐడన్ మార్క్రమ్ 4 పరుగులు, మార్కో జాన్సెన్ 5 పరుగులు, కేశవ్ మహరాజ్ 4 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగారు. బంగ్లాదేశ్ తరపున తంజిమ్ హసన్ సాకిబ్ అత్యధికంగా 3 వికెట్లు, తస్కిమ్ అహ్మద్ 2 వికెట్లు, రిషద్ హుస్సేన్ 1 వికెట్ తీశారు.

తడబడిన బంగ్లాదేశ్ జట్టు..

లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్‌కు కూడా శుభారంభం లభించలేదు. ఆ జట్టు 50 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తౌహిద్ హృదయోయ్, మహ్మదుల్లా చక్కటి భాగస్వామ్యంతో జట్టును వంద పరుగులకు చేరువ చేశారు. కాగా, ఈ జోడీ భాగస్వామ్యానికి బ్రేక్ పడడంతో బంగ్లాదేశ్ జట్టు కూడా విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచింది. ఆఖర్లో మహ్మదుల్లా సిక్సర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. చివరకు ఆ జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..