IPL 2024: హెయిర్ స్టైల్ మార్చిన విరాట్ కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడంటోన్న ఫ్యాన్స్..

|

Mar 19, 2024 | 12:49 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌తో IPL 2024 ప్రారంభమవుతుంది.

IPL 2024: హెయిర్ స్టైల్ మార్చిన విరాట్ కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడంటోన్న ఫ్యాన్స్..
Virat Kohli New Hair Style
Follow us on

Virat Kohli’s New Look For IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ప్రారంభానికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్‌లో కనిపించాడు. ఆర్‌సీబీ జట్టు అన్‌బాక్సింగ్ ఈవెంట్‌కు ముందు కోహ్లీ తన హెయిర్‌స్టైల్‌ను మార్చుకుని కొత్త అవతారంలో మెరిశాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే విరాట్ కొత్త లుక్ తో ఆర్సీబీ జట్టు అదృష్టం కూడా మారిపోతుందనే చర్చలు కూడా మొదలయ్యాయి.

ఎందుకంటే కింగ్ కోహ్లి గత 16 సీజన్‌లుగా RCB తరపున ఆడాడు. ఇప్పటి వరకు 237 మ్యాచ్‌లు ఆడి 7263 పరుగులు చేశాడు. అయితే కింగ్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ ఎండమావిగానే మిగిలిపోయింది.

RCB జట్టు 2009, 2011లో ఫైనల్‌లోకి ప్రవేశించినప్పటికీ కప్ గెలవలేకపోయింది. 2016లో విరాట్ కోహ్లీ సారథ్యంలో రాయల్ జట్టు ఫైనల్ ఆడినప్పటికీ కేవలం 8 పరుగుల తేడాతో తొలి ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఆర్‌సీబీ జట్టు ఫైనల్‌కు చేరలేదు. అందుకే కోహ్లి కొత్త లుక్‌తో ఆర్‌సీబీ జట్టు అదృష్టం మారాలని అభిమానులు కోరుకుంటున్నారు.

విరాట్ కోహ్లీ లుక్‌కి కొత్త టచ్ ఇచ్చింది ఎవరో కాదు.. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్. గతంలో ధోనీ, చాహల్‌తో సహా టీమిండియా ఆటగాళ్ల రూపురేఖలను మార్చిన అలీమ్.. ఇప్పుడు విరాట్ కోహ్లీని బలమైన స్టైలిస్ట్‌గా చూపించాడు.

RCB ప్రాబబుల్ ప్లేయింగ్ XI vs CSK : ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కెమెరూన్ గ్రీన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్.

RCB పూర్తి జట్టు:ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయేష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..