హార్దిక్ విశ్రాంతితో కోహ్లీ టీంమేట్‌కు కలిసొచ్చిన లక్.. సౌతాఫ్రికా సిరీస్‌లో అరంగేట్రం చేయనున్న ఇంజనీర్.. ఎవరంటే?

| Edited By: Anil kumar poka

Sep 28, 2022 | 12:44 PM

India vs South Africa: రేపటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2022కి ముందు టీమ్ ఇండియాకు ఇదే చివరి సిరీస్.

హార్దిక్ విశ్రాంతితో కోహ్లీ టీంమేట్‌కు కలిసొచ్చిన లక్.. సౌతాఫ్రికా సిరీస్‌లో అరంగేట్రం చేయనున్న ఇంజనీర్.. ఎవరంటే?
Ind Vs Sa Shahbaz Ahmed, Virat Kohli
Follow us on

India vs South Africa: టీ20 ప్రపంచకప్‌2022కు సిద్ధమయ్యే పనిలో టీమిండియా బిజీగా ఉంది. ప్రపంచకప్‌నకు ముందు చివరి టీ20 సిరీస్‌ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. రేపటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌కు జట్టులో చోటు దక్కింది. అతను సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అంతకుముందు ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లి జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగాడు. అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు.

27 ఏళ్ల షాబాజ్ అహ్మద్ కూడా క్రికెట్ ఆడుతూనే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే, క్రికెట్ అతని తొలి ప్రాధాన్యతగా మారింది. ఈ కారణంగా అతను చాలా కష్టంగా క్లాసులకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన చదువును పూర్తి చేసి, ఆటపై ఫోకస్ పెంచాడు. హర్యానాకు చెందిన షాబాజ్‌కి క్రికెట్‌లోకి రావడం అంత సులువు కాలేదు. క్రికెట్‌లో కెరీర్‌ను నిలబెట్టుకోవాలనే స్నేహితుడి కోరిక మేరకు బెంగాల్ వెళ్లాడు. అక్కడ డిసెంబర్ 2018లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భారత్ తరపున ఆడాలని కలలు కంటున్నాడు.

ఐపీఎల్ 2022 వేలంలో..

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాబాజ్ అహ్మద్‌ను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ.20 లక్షలు. అంటే, అతన్ని జట్టు 10 రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది. IPL 2022లో అతను 16 మ్యాచ్‌లలో 27 సగటుతో 219 పరుగులు చేశాడు. 45 పరుగుల బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. స్ట్రైక్ రేట్ 121గా నిలిచింది. దీంతో పాటు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 4 వికెట్లు కూడా తీశాడు. టీ20 లీగ్‌లో ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. మొత్తం T20 ప్రదర్శనను పరిశీలిస్తే, అతను 56 మ్యాచ్‌లలో 20 సగటుతో 512 పరుగులు చేశాడు. 60 పరుగుల నాటౌట్‌ ఇన్నింగ్స్‌, 30 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. 7 పరుగులకే 3 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

షాబాజ్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 19 మ్యాచ్‌లలో 1 సెంచరీ, 8 హాఫ్ సెంచరీల సహాయంతో మొత్తం 1103 పరుగులు చేశాడు. అతను 2.71 ఎకానమీ రేటుతో మొత్తం 62 వికెట్లు కూడా పడగొట్టాడు. 57 పరుగులకు 7 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 3 సార్లు 5 వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాపై లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బాగా రాణించాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై షాబాజ్ ఈ ఘనతను పునరావృతం చేయాలనుకుంటున్నాడు. గాయం కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు.

రేపటి నుంచే టీ20 సిరీస్..

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 28న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రెండో టీ20 అక్టోబరు 2న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో, మూడో మ్యాచ్ అక్టోబర్ 4న ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మూడు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టు-

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, షాబాజ్ అహ్మద్, ఉమేష్ యాదవ్.

భారత్‌తో సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు..

టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జన్మాన్ మలన్, ఐదాన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, తబ్సోరిజ్ రైస్‌బాసి.