Team India: టీమిండియా ఛాంపియన్లపై కేసు నమోదు.. క్షమాపణలు చెప్పినా, ఆగని ఫిర్యాదులు

|

Jul 16, 2024 | 6:51 PM

Harbhajan Singh, Yuvraj Singh Controversy: ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరిగిన డబ్ల్యుసీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో, భారత ఛాంపియన్లు పాకిస్తాన్ ఛాంపియన్‌లను ఓడించి ప్రారంభ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్లు చేసిన ఓ వీడియో ఇప్పుడు వివాదానికి కారణమైంది.

Team India: టీమిండియా ఛాంపియన్లపై కేసు నమోదు.. క్షమాపణలు చెప్పినా, ఆగని ఫిర్యాదులు
Harbhajan Yuvraj Raina
Follow us on

Harbhajan Singh, Yuvraj Singh Controversy: టీమిండియా మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది రోజుల క్రితం, ముగ్గురు ఆటగాళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, తౌబా తౌబా మై కై చాయ్ పాటకు చిందులేస్తూ కనిపించారు. కానీ ఈసారి చేసిన డ్యాన్స్ కొందరిని అవమానించినట్లుగా ఉందని ఆరోపణలు వచ్చాయి. నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ ఇప్పుడు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లపై ఫిర్యాదు చేశారు.

యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనాలు 10 కోట్ల మందికి పైగా వికలాంగులను అవమానించారని, ఎగతాళి చేశారని, వీరిపై న్యూఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇన్‌స్టాగ్రామ్ (మెటా యాజమాన్యం)పై కూడా ఫిర్యాదు దాఖలైంది. వికలాంగులను అవమానించేలా వీడియో ఉన్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం బ్లాక్ చేయలేదు. మెటా కంపెనీపై కూడా ఫిర్యాదు చేసినట్లు అర్మాన్ అలీ తెలిపారు.

హర్భజన్ సింగ్ ఓ ఎంపీ. వికలాంగుల కోసం తమ గళాన్ని పెంచాలి. అయితే ఇలాంటి వారే వికలాంగుల వైకల్యాలపై వీడియో తీయడం బాధాకరం అంటూ ఆయన వాపోయారు. ఎప్పుడూ వికలాంగులపై జోక్స్ వేస్తూ ఎగతాళి చేస్తుంటారు. ఇదంతా ఆగిపోవాలని కోరుకుంటున్నాను. అందుకోసమే అర్మాన్ అలీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో దుమారం రేగడంతో హర్భజన్ సింగ్ ఈ వివాదాస్పద వీడియోను తొలగించాడు. అలాగే ఎవరినీ నొప్పించాలని, ఎగతాళి చేయాలన్నా ఉద్దేశం కూడా లేదు. నేను గత 15 రోజులుగా క్రికెట్ ఆడాను. కాబట్టి మా పరిస్థితి ఇలాగే ఉందంటూ వీడియో తీశాం. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలంటూ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..