T20 World Cup 2026 : అర్హత లేని జట్టుకు అదే గతి.. పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రస్థానం ముగిసింది. కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. నిజానికి పాక్ నిష్క్రమణ పట్ల ఆ దేశ అభిమానులు తప్ప, మిగిలిన క్రికెట్ ప్రపంచం పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు.

T20 World Cup 2026 : అర్హత లేని జట్టుకు అదే గతి.. పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
Pakistan Vs Namibia

Updated on: Mar 01, 2026 | 12:20 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రస్థానం ముగిసింది. కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. నిజానికి పాక్ నిష్క్రమణ పట్ల ఆ దేశ అభిమానులు తప్ప, మిగిలిన క్రికెట్ ప్రపంచం పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే ఈ టోర్నీలో ఆ జట్టు ప్రదర్శన చూస్తుంటే అసలు వారు టాప్-4లో ఉండటానికి అర్హులేనా? అన్న సందేహం కలుగుతోంది. సూపర్-8 రౌండ్‌లో శ్రీలంకతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా, సెమీస్ చేరడానికి కావాల్సిన సమీకరణాలను అందుకోవడంలో పాక్ ఘోరంగా విఫలమైంది.

సెమీఫైనల్ చేరాలంటే పాకిస్థాన్ ముందు ఉన్న దారి చాలా కష్టమైనది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 212 పరుగులు సాధించింది. అయితే సెమీస్ బెర్తు దక్కించుకోవాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉంది. కానీ ఆ పని చేయలేకపోగా, లంక చేతిలో ఓడిపోయేంత పని చేసింది. చివరికి కేవలం 5 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి పరువు నిలుపుకుంది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లాండ్ తర్వాత న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు క్వాలిఫై అయ్యాయి. పాక్ ఆటతీరు గమనిస్తే, వారు గెలిచిన నాలుగు మ్యాచుల్లో మూడు అసోసియేట్ దేశాల (చిన్న జట్లు) పైనే కావడం విశేషం.

టోర్నీ ఆరంభం నుంచే పాక్ తడబడుతూ వచ్చింది. నెదర్లాండ్స్‌పై కేవలం 3 వికెట్ల తేడాతో అతికష్టమీద నెగ్గింది. నమీబియాపై రెండుసార్లు గెలిచినా, అసలైన పరీక్ష ఎదురైన చోట మాత్రం చేతులెత్తేసింది. టీమ్ ఇండియా చేతిలో 61 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. సూపర్ 8లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. వర్షం కారణంగా న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు కావడం కూడా వారికి శాపంగా మారింది. ఇలాంటి పేలవమైన ఫామ్‌తో సెమీస్ ఆశించడం అత్యాశే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్థాన్ క్రికెట్ పతనం ఇక్కడితో ఆగిపోలేదు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆ జట్టు ఏ ఐసీసీ టోర్నీలోనూ కనీసం సెమీస్ చేరలేదు. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా అన్నింటిలోనూ గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో కూడా ఎక్కడా కనిపించలేదు. పాక్ క్రికెట్‌లో సమూల మార్పులు చేయకపోతే ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us