Video: శ్రీలంక ఆటగాడితో గొడవపడిన మహ్మద్ సిరాజ్.. జోక్యం చేసుకోని సహచరులు.. అసలేమైందంటే..

|

Aug 07, 2024 | 8:18 PM

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్‌తో మహ్మద్ సిరాజ్ గొడవపడ్డాడు. కొంత సేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సమయంలో ఏ ఆటగాడు ఇద్దరిని సముదాయించేందుకు రాలేదు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏడు వికెట్లకు 248 పరుగులు చేసింది.

Video: శ్రీలంక ఆటగాడితో గొడవపడిన మహ్మద్ సిరాజ్.. జోక్యం చేసుకోని సహచరులు.. అసలేమైందంటే..
Siraj And Mendis
Follow us on

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్‌తో మహ్మద్ సిరాజ్ గొడవపడ్డాడు. కొంత సేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సమయంలో ఏ ఆటగాడు ఇద్దరిని సముదాయించేందుకు రాలేదు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏడు వికెట్లకు 248 పరుగులు చేసింది. లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో అత్యధికంగా 96 పరుగులు చేశాడు. కుశాల్ 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ చాలా ఖరీదైన బౌలర్‌గా మారాడు. తొమ్మిది ఓవర్లలో 78 పరుగులు ఇచ్చాడు.

39వ ఓవర్ మూడో బంతికి కుసాల్‌తో సిరాజ్ గొడవ..

శ్రీలంక బ్యాటర్ చాలా ఆలస్యంగా స్టంప్‌లోకి వెళుతున్న బంతిని ఆడాడు. అలాగే దాని నుంచి రక్షించుకునేందుకు బ్యాట్‌తో అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో సిరాజ్‌కు కోపం వచ్చింది. అతను ఏదో చెబుతూ కుశల్‌కి సైగ చేస్తూ కనిపించాడు. తక్కువ మాట్లాడి ఎక్కువ పరుగులు చేయమని చెబుతున్నట్లు అనిపించింది. అదే సమయంలో కుశాల్ ఏం జరిగిందంటూ సిరాజ్ వైపు దూసుకొచ్చాడు. దీంతో సిరాజ్, కుశాల్ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంలో, రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సమీపంలో నిలబడి ఉన్నారు. అయితే వారిద్దరూ ఎలాంటి జోక్యం చేసుకోలేదు.

శ్రీలంక ఇన్నింగ్స్ 39వ ఓవర్లో సిరాజ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఇందులో ఐదో బంతికి సదీర సమరవిక్రమ (0) వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో అతనికి ఈ వికెట్ మాత్రమే దక్కింది. రియాన్ పరాగ్ భారత్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్. తొమ్మిది ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇది అతనికి తొలి వన్డే మ్యాచ్. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కూడా ఒక్కో వికెట్ అందుకున్నారు.

శ్రీలంక బలమైన బ్యాటింగ్..

శ్రీలంక బ్యాటింగ్‌లో ఫెర్నాండో, కుసాల్ అర్ధ సెంచరీలతో పాటు పాతుమ్ నిస్సాంక కూడా బాగా ఆడాడు. అతను 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. నిస్సాంక, ఫెర్నాండో మధ్య తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కుసల్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు ఉన్నాయి. లోయర్ ఆర్డర్‌లో కమిందు మెండిస్ 19 బంతుల్లో సిక్సర్ సాయంతో అజేయంగా 23 పరుగులు చేశాడు.

భారీ ఓటమి దిశగా భారత్..

వార్త రాసే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. రోహిత్ 35, కోహ్లీ 20, పరాగ్ 15 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..