దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కేసుల సంఖ్య ప్రమాదకంగా పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 28 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ముంబైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లపై కరోనా ఎఫెక్ట్ ఉంటోదేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్లో పాల్గొనే క్రికెటర్లు, ఇతర సిబ్బంది బయో బబుల్ ఉంటారని, దీంతో వాళ్లకు ఈ రూల్స్‌లో వారికి మినహాయింపు ఉంటుందని అసీమ్ గుప్తా చెప్పారు. మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రేక్షకులకు అనుమతి లేదు కాబట్టి షెడ్యూల్ ప్రకారం అవి జరుగుతాయని వెల్లడించారు.
ముంబై వాంఖడే స్టేడియంలో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు సాధన చేస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్రలోని కరోనా ఆంక్షలు ఐపీఎల్‌ను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అక్కడి మ్యాచ్‌లనే వేరే చోటుకు తరలించే విషయమై బీసీసీఐ ఆలోచన చేస్తోందని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో ముంబై-బెంగళూరు జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. చెన్నై-ఢిల్లీ మధ్య రెండో మ్యాచ్ ముంబైలో జరగనుంది. కాగా ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తమ ఫేవరెట్ టీమ్స్.. సత్తా చాటాలని ఆశపడుతున్నారు. మరి ఈ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మ్యాచ్‌లు ఎలా జరుగుతాయో, కప్పు ఎవరు ఎగరేసుకుపోతారో చూడాలి.
Also Read: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు… పరిశోధనలో విస్తుపోయే విషయాలు
చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం