Krunal vs Deepak Hooda: కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆనాటి గొడవతో లింక్ చేసిన నెటిజన్లు..!

|

Jan 27, 2022 | 10:10 AM

IND vs WI: దీపక్ హుడా భారత జట్టులో ఎంపికకు సంబంధించిన లింక్ పెట్టి, కృనాల్ పాండ్యాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20ఐ సిరీస్‌ల కోసం..

Krunal vs Deepak Hooda: కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆనాటి గొడవతో లింక్ చేసిన నెటిజన్లు..!
Hardik Pandya
Follow us on

Krunal Pandya vs Deepak Hooda: టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పలు రకాలు ట్వీట్లు వస్తున్నాయి. దీపక్ హుడా జట్టులో ఎంపికకు లింక్ పెట్టి, కృనాల్ పాండ్యాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ల కోసం టీమిండియాను బుధవారం ప్రకటించారు. దీపక్ హుడా కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓ మ్యాచ్‌లో కృనాల్, దీపక్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో, అభిమానులు కృనాల్ ట్విట్టర్ ఖాతా నుంచి దీపక్ ఎంపికతో అసభ్యకరమైన ట్వీట్లను లింక్ చేశారు.

వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 అంతర్జాతీయ సిరీస్‌ల కోసం కృనాల్, హార్దిక్ పాండ్యాలకు జట్టులో చోటు దక్కలేదు. దీపక్ హుడా టీమ్ ఇండియాలో చేరిన వెంటనే కృనాల్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని అభిమానులు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కృనాల్ పాండ్యా మద్యం సేవించి ట్వీట్ చేస్తున్నాడని, అతని ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందంటూ పలు కామెంట్లు వస్తున్నాయి.

జనవరి 2021లో, దీపక్ హుడా.. కృనాల్ పాండ్యాను దుర్భాషలాడాడని ఆరోపణలు వచ్చాయి. దీపక్ హుడా తన కెరీర్‌ను ముగించేస్తానని బెదిరించాడని కూడా చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీపక్ జులై 2021లో బరోడా తరపున ఆడుతున్నాడు. హుడా, కృనాల్‌ల పోరు తర్వాత జనవరిలో బరోడా క్రికెట్ అసోసియేషన్ దీపక్‌పై ఏడాది నిషేధం విధించింది.

Also Read: SL vs AUS: కొత్త పాత్రలో శ్రీలంక దిగ్గజ బౌలర్.. మరోసారి జాతీయ జట్టుతో జతకట్టేందుకు రెడీ..!

IND vs WI: రవి బిష్ణోయ్ ఎంట్రీ నుంచి అశ్విన్‌పై వేటు వరకు.. టీమిండియా స్వ్కాడ్‌లో 5 భారీ మార్పులు