ఇలాంటోడు టీమిండియాలో అస్సలు వద్దు.. పీకిపారేయండి…!

Asian Games 2026 Cricket: 2026 ఆసియా క్రీడల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో గెలిచి భారత్ స్వర్ణ పతకం సాధించింది. అయితే, రవి బిష్ణోయ్ బౌలింగ్ ప్రదర్శన తీవ్ర విమర్శలకు గురైంది. మూడు ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్న అతనిపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "బిష్ణోయ్ ఒక వేస్ట్ బౌలర్" అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

ఇలాంటోడు టీమిండియాలో అస్సలు వద్దు.. పీకిపారేయండి...!
Krishnamachari Srikkanth Slams Ravi Bishnoi

Updated on: Oct 05, 2026 | 8:59 PM

Asian Games 2026 Cricket: 2026 ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన ఫైనల్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత అమ్మాయిల జట్టు గోల్డ్ గెలిచినట్టే, పురుషుల జట్టు కూడా స్వర్ణాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది.

మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారీగా 211 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. పాకిస్తాన్ బ్యాటర్ నవాజ్ 51 బంతుల్లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, జట్టును గెలిపించలేకపోయాడు.

ఎక్కువమంది చదివినది: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ, ఒక ప్లేయర్ ప్రదర్శన మాత్రం ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ నిపుణులను కూడా కలవరపరిచింది. జట్టులోని ప్రధాన స్పిన్నర్ రవి బిష్ణోయ్ మరోసారి నిరాశపరిచాడు. మూడు ఓవర్లు వేసిన బిష్ణోయ్ ఏకంగా 44 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతని బౌలింగ్‌ను పాకిస్తాన్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొని భారీగా పరుగులు రాబట్టారు. బిష్ణోయ్ గనక నాలుగో ఓవర్ వేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

భారత్ తరఫున బుమ్రా, వాషింగ్టన్ సుందర్ 18వ, 19వ ఓవర్లలో పరుగులను నియంత్రించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో పాటు, శివం దూబే తాను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీయడం భారత్ విజయానికి దోహదపడింది. బ్యాటింగ్‌లో చివర్లో తిలక్ వర్మ దంచి కొట్టడం కూడా కలిసి వచ్చింది. లేకపోతే, మ్యాచ్ ఫలితం మారి ఉండేదని చెప్పడంలో సందేహం లేదు.

రవి బిష్ణోయ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “అతను వేస్ట్ బౌలర్. టీమిండియాలో అతనిని కొనసాగించడమే వేస్ట్. ఒక మ్యాచ్‌లో బాగా వేస్తే, 10 మ్యాచుల్లో ఫెయిల్ అవుతున్నాడు. తనవల్ల ఆసియా గేమ్స్ ఫైనల్‌లో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టుకు ఊపిరి పోశాడు. తన దారుణంగా పరుగులు ఇవ్వటం ఆందోళన కలిగించే అంశం. ఇంకొక ఓవర్ అతను వేసి ఉంటే ఫలితం రివర్స్ అయ్యేది” అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

ఎక్కువమంది చదివినది: హాంకాంగ్ సిక్సెస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్..?

బిష్ణోయ్ గతంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో కూడా దారుణంగా బౌలింగ్ చేశాడని, ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే అతనిని కొనసాగిస్తున్నారని సమాచారం. స్పిన్ పిచ్‌లపై కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడం రవి బిష్ణోయ్ బలహీనతగా మారింది. ఆసియా గేమ్స్ ఫైనల్ మ్యాచ్ అతని కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ జట్టు గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడిందని, ఇకపై వారిని తక్కువ అంచనా వేయకూడదని కూడా ఈ మ్యాచ్ ద్వారా స్పష్టమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us