IPL 2027: ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే సంచలన ట్రేడింగ్‌లు.. ఆ ముగ్గురు టీమ్స్ మారుతున్నారా?

IPL 2027: ఐపీఎల్ 2027 ఆక్షన్‌కు ముందే ట్రేడింగ్ విండోపై ఆసక్తి పెరుగుతోంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, సామ్ కరన్ పేర్లు సంచలన ట్రేడ్ చర్చల్లో వినిపిస్తున్నాయి. ముంబై, కేకేఆర్, రాజస్థాన్, ఆర్సీబీ జట్ల మధ్య ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ డీల్స్‌పై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని ట్రేడింగ్ వార్తలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

IPL 2027: ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే సంచలన ట్రేడింగ్‌లు.. ఆ ముగ్గురు టీమ్స్ మారుతున్నారా?
Ipl 2027

Updated on: Sep 17, 2026 | 10:50 AM

IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) మెగా లేదా మినీ ఆక్షన్‌కు సంబంధించి ఇప్పటివరకు బీసీసీఐ అధికారిక తేదీని ప్రకటించలేదు. ఈసారి ఆక్షన్‌ను భారత్‌లోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆక్షన్ ప్రక్రియ ప్రారంభానికి వారం రోజుల ముందు వరకు ట్రేడ్ విండో అందుబాటులో ఉండటంతో.. ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ జోరుగా సాగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నుంచి తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారడం, ఆయన బదులుగా కుల్దీప్ యాదవ్ లక్నోకి వెళ్లడం వంటి భారీ ట్రేడింగ్ జరగగా.. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన డీల్స్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

1. హార్దిక్ పాండ్యా – కెమరూన్ గ్రీన్ (ముంబై – కోల్‌కతా ట్రేడ్)

ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హార్దిక్ పాండ్యా గురించిన చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ముంబై ఇండయన్స్ (MI) జట్టును హార్దిక్ వీడుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ప్రస్తుతం కెప్టెన్, ఆల్ రౌండర్ అవసరం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కేకేఆర్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ డీల్ కుదిరితే, కేకేఆర్ తమ వద్ద ఉన్న స్టార్ ఆల్ రౌండర్ కెమరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌కు పంపే అవకాశం ఉంది. ఇది అచ్చం లైక్-టు-లైక్ ట్రేడ్‌లా మారుతుంది.

2. సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్ నుంచి కేకేఆర్‌కు?)

ఈ ట్రేడింగ్ జాబితాలో మరో సంచలన అంశం సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టును వీడే అవకాశం ఉందనే ప్రచారం. కేకేఆర్‌కు పవర్‌ఫుల్ కెప్టెన్ అవసరం ఉన్నందున, సూర్యకుమార్ యాదవ్ మళ్లీ కోల్‌కతా గూటికి చేరవచ్చని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా అభిప్రాయపడ్డారు. సూర్యకుమార్ గతంలో 2014-2017 మధ్య కాలంలో కేకేఆర్ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు కానీ ఈ వార్త క్రికెట్ సర్కిల్స్‌లో మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది.

3. సామ్ కరన్ (రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

గత సీజన్‌లో సంజు శామ్సన్ ట్రేడ్ డీల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు (RR) వెళ్లిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ పేరు ఇప్పుడు ఆర్సీబీ (RCB)లో చేరవచ్చని వినిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సామ్ కరన్‌ను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రోమారియో షెఫర్డ్‌తో సామ్ కరన్‌ను ట్రేడ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మూడు ప్రధాన ట్రేడింగ్‌లు గనుక నిజమైతే ఐపీఎల్ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us