IPL 2022: DRS విషయంలో అంపైర్‌తో గొడవపడిన కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్.. చివరికి ఏం జరిగిందంటే..?

|

May 15, 2022 | 6:20 AM

IPL 2022: IPL 2022లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు అంపైర్‌తో గొడవలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఆటగాళ్లు వైడ్ బాల్‌కు సంబంధించి, మరికొన్ని

IPL 2022: DRS విషయంలో అంపైర్‌తో గొడవపడిన కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్.. చివరికి ఏం జరిగిందంటే..?
Drs Controversy
Follow us on

IPL 2022: IPL 2022లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు అంపైర్‌తో గొడవలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొన్నిసార్లు ఆటగాళ్లు వైడ్ బాల్‌కు సంబంధించి, మరికొన్ని సార్లు నో బాల్‌కి సంబంధించి అంపైర్లతో గొడవపడుతున్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నో-బాల్‌కు సంబంధించి అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (KKR vs SRH) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటిదే జరిగింది. ఇక్కడ KKR బ్యాట్స్‌మెన్ రింకూసింగ్‌ DRS (Decision Review System) విషయంలో అంపైర్‌తో గొడవపడ్డాడు. శనివారం పూణెలో హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసింది. 10వ ఓవర్లకి జట్టు స్కోరు 83 పరుగులు కాగా అదే సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పుడు క్రీజులో రింకూ సింగ్, సామ్ బిల్లింగ్స్ ఉన్నారు. జట్టు ఇద్దరి నుంచి మంచి భాగస్వామ్యాన్ని ఆశించింది. కానీ కథ వేరేలా సాగింది.

హైదరాబాద్‌ బౌలర్‌ నటరాజన్‌ 12వ ఓవర్ మూడో బంతిని యార్కర్ వేశాడు. క్రీజులో ఉన్న రింకూసింగ్‌ ఆ బంతిని ఆడలేక పోవడంతో బంతి ప్యాడ్‌కు తగిలింది. నటరాజన్‌ అప్పీల్‌ చేయడంతో అంపైర్ LBW ప్రకటించాడు. అయితే రింకుకు DRS తీసుకునే అవకాశం ఉంది. దీని కోసం అతను మరో బ్యాట్స్‌మెన్‌ బిల్లింగ్స్‌తో చర్చించాడు. చివరి సెకనులో బిల్లింగ్స్ డీఆర్‌ఎస్‌ సూచించినప్పటికీ అంపైర్ అంగీకరించలేదు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో బ్యాట్స్‌మెన్‌లిద్దరూ అంపైర్లతో చర్చలు ప్రారంభించారు.

వాస్తవానికి బిల్లింగ్స్ DRS కోసం అప్పీల్ చేసాడు. కానీ అంపైర్ దానిని అంగీకరించలేదు ఎందుకంటే నిబంధనల ప్రకారం బ్యాటింగ్‌ ఎవరు చేశారో వారు మాత్రమే డీఆర్‌ఎస్‌ అప్పీల్ చేయాల్సి ఉంటుంది. నాన్‌ స్టైకర్ అప్పీలు చేయడాని వీలులేదు. బిల్లింగ్స్, రింకూ సింగ్ పెద్ద తప్పు చేశారు. అంపైర్‌లతో సుదీర్ఘ చర్చలు విజ్ఞప్తి విజయవంతం కాలేదు. దీంతో రింకూ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అతను కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఆ తర్వాత చూపిన రీప్లేల్లో రివ్యూ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేలింది. ఎందుకంటే బంతి నేరుగా స్టంప్‌లను తాకడంతోపాటు రింకూ బ్యాట్‌ని కూడా బంత తాకలేకపోయిందని స్పష్టమైంది.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Tips: డ్రైవింగ్‌ చేసేటప్పుడు వెన్నునొప్పి వేధిస్తుందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Health Tips: ఆర్థరైటిస్‌ రోగులు ఈ ఆహార పదార్థాలని అస్సలు తినవద్దు.. ఎందుకంటే..?

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!