IND vs WI: తండ్రితో పోరాడి, చదువును వదిలి మరీ శ్రమించాడు.. అవకాశాలొచ్చే వరకూ పట్టువదల్లేదు.. చివరకు ఇలా..

|

Jan 27, 2022 | 2:19 PM

Ravi Bishnoi: అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత, రవి బిష్ణోయ్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడే అవకాశాన్ని పొందాడు. ప్రస్తుతం టీమిండియాలో భాగమయ్యాడు.

IND vs WI: తండ్రితో పోరాడి, చదువును వదిలి మరీ శ్రమించాడు.. అవకాశాలొచ్చే వరకూ పట్టువదల్లేదు.. చివరకు ఇలా..
Ind Vs Wi Ravi Bishnoi
Follow us on

India Vs West Indies: వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ బుధవారం జట్టును ప్రకటించింది. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్‌కు టీ20 జట్టులో సెలక్టర్లు అవకాశం కల్పించారు. రవికి అది అతని కష్టానికి, త్యాగానికి దక్కిన ఫలం. క్రికెట్‌ కోసం చదువు మానేసి తండ్రికి ఇష్టంలేని ఆటను కొనసాగించాడు. ఎన్ని తిరస్కరణలు వచ్చినా తనపై తనకున్న నమ్మకంతో ముందుకుసాగాడు.నేటికి ఆ కుర్రాడి నమ్మకం వమ్ము కాలేదు.

2018 సంవత్సరంలో, రవి బిష్ణోయ్ క్రికెట్ కోసం తన తండ్రికి వ్యతిరేకంగా ముందుకు సాగాల్సి వచ్చింది. అతను రాజస్థాన్ రాయల్స్ కోసం నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో అతని బోర్డు పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. కొడుకు తిరిగి వచ్చి పరీక్ష రాయాలని తండ్రి కోరుకున్నాడు. కానీ, రవి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో రవి కెరీర్ అక్కడ మలుపు తిరిగింది. రవి ఇప్పటి వరకు బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదు.

అండర్-19 ప్రపంచకప్‌కు ముందు రవి చాలా తిరస్కరణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతను మొదట అండర్ -16 ట్రయల్స్‌లో ఎంపిక కాలేదు. ఆ తర్వాత అతను అండర్ -19 ట్రయల్స్‌లో రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాడు. అయినా రవి మాత్రం పట్టు వదల్లేదు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బౌలింగ్ చేస్తున్ సమయంలో కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న దిశాంత్ యాగ్నిక్‌ని ఆకట్టుకున్నాడు.

ఇక అక్కడే రవి లైఫ్ టర్న్ తిరిగింది. అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. అక్కడ అతను మొత్తం టోర్నమెంట్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. జపాన్, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచుల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అక్కడి నుంచే IPLలో అడుగుపెట్టే ఛాన్స్ దొరికింది. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్‌ XI లో చోటు దక్కడంతో అతని ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.

రవి నేడు భారత స్పిన్ బౌలింగ్ భవిష్యత్తుగా మారుతున్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో, అతను దిగ్గజ బౌలర్ల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Also Read: IND vs WI Records: భారత్ వర్సెస్ విండీస్ వన్డే మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు.. అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా?

MS Dhoni: అందుకే ఇప్పటి వరకు ధోని ఫోన్ నంబర్ నా దగ్గర లేదు: టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు