IND vs SA: 12 రోజుల్లో 3వసారి.. 5 మ్యాచ్‌ల్లో 4వ సెంచరీ.. చెన్నైలో లేడీ కోహ్లీ దూకుడు..

|

Jun 28, 2024 | 1:44 PM

T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఘర్షణ గురించి చర్చ జరుగుతోంది. అయితే, ఈ రెండు దేశాల మధ్య మరో మ్యాచ్ కూడా జరుగుతోంది. మహిళల క్రికెట్ జట్ల మధ్య చెన్నైలో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి మొదలైంది. ఇందులో స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది.

IND vs SA: 12 రోజుల్లో 3వసారి.. 5 మ్యాచ్‌ల్లో 4వ సెంచరీ.. చెన్నైలో లేడీ కోహ్లీ దూకుడు..
Smriti Mandhana Century
Follow us on

T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఘర్షణ గురించి చర్చ జరుగుతోంది. అయితే, ఈ రెండు దేశాల మధ్య మరో మ్యాచ్ కూడా జరుగుతోంది. మహిళల క్రికెట్ జట్ల మధ్య చెన్నైలో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి మొదలైంది. ఇందులో స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. స్మృతి మంధాన దక్షిణాఫ్రికాతో టెస్ట్ ఫార్మాట్‌లో తన ఆటను ODIలో ఎక్కడైతే వదిలిపెట్టిందో.. అక్కడి నుంచే ప్రారంభించింది. దక్షిణాఫ్రికాపై మంధాన 122 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసింది. ఆమె టెస్టు కెరీర్‌లో ఇది రెండో సెంచరీ.

భారత ఓపెనింగ్ జోడీ స్మృతి మంధాన (111), షెఫాలీ వర్మ (117) 45 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 230 పరుగులతో దూసుకెళ్తున్నారు. సెంచరీలతో చెలరేగిన ఈ ఇద్దరు భారీ స్కోర్‌పై కన్నేశారు.

12 రోజుల్లో స్మృతి మంధాన మూడో సెంచరీ..

చెన్నై టెస్టులో స్మృతి మంధాన గత 12 రోజుల్లో దక్షిణాఫ్రికాపై సాధించిన మూడో సెంచరీ ఇది. దీనికి ముందు, జూన్ 16, 19 తేదీల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆమె రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసింది. ఇక ఇప్పుడు జూన్ 28న టెస్టు క్రికెట్‌లోనూ మరో సెంచరీ చేసింది.

మంధాన సెంచరీతో భారీ స్కోర్ దిశగా భారత్..

స్మృతి మంధాన సెంచరీతో చెన్నై టెస్టులో భారత మహిళల జట్టు ముందుంది. మంధాన ఇన్నింగ్స్ ఎంత పెద్దదైతే దక్షిణాఫ్రికాకు అంత కష్టాలు పెరుగుతాయి. వార్త రాసే సమయానికి 51  ఓవర్లు ముగిసే సరికి షఫాలీ వర్మ 139 పరుగులు చేసి క్రీజులో ఉంది. స్మృతి మంధాన 142 పరుగులతో ఉంది.

ఇరు జట్లు:

దక్షిణాఫ్రికా మహిళలు (ప్లేయింగ్ XI): లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), సునే లూస్, అన్నెకే బాష్, మారిజాన్ కాప్, డెల్మీ టక్కర్, నాడిన్ డి క్లర్క్, అన్నరీ డెర్క్‌సెన్, సినాలో జాఫ్తా(కీపర్), మసాబటా క్లాస్, నోంకులులేకో మ్లాబా, తుమీ సెఖుఖునే.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, శుభా సతీష్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్ సింగ్, రాజేశ్వరి గయక్వాడ్.