టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వనున్న శాంసన్.. మరో ప్లేయర్ అరంగేట్రం చేసే ఛాన్స్.. అక్టోబర్ 6 నుంచి సౌతాఫ్రికాతో వన్డే పోరు..

|

Sep 27, 2022 | 9:38 AM

India vs South Africa: త్వరలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించనున్నారు. ఇందులో సంజు శాంసన్-రజత్ పాటిదార్‌లు జట్టులో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వనున్న శాంసన్.. మరో ప్లేయర్ అరంగేట్రం చేసే ఛాన్స్.. అక్టోబర్ 6 నుంచి సౌతాఫ్రికాతో వన్డే పోరు..
Ind Vs Sa Sanju Samson
Follow us on

ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లలో తలపడనుంది. బుధవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 6 నుంచి మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. వన్డే సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించబోతున్నారు. నివేదికల ప్రకారం, సంజు శాంసన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా మారింది. పీటీఐ ప్రకారం, శుభమాన్ గిల్, సంజు శాంసన్ జట్టులో ఉండటం ఖాయమని తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ కూడా వన్డే జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు.

రజత్ పాటిదార్ కూడా?

గత కొన్ని నెలలుగా రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2022లో పాటిదార్ అద్భుత ప్రదర్శన చేశాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 8 మ్యాచ్‌ల్లో 55 కంటే ఎక్కువ సగటుతో 333 పరుగులు చేశాడు. ఇందులో అతను ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్-ఏ పై 2 సెంచరీలు..

పాటిదార్ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ చేసి మధ్యప్రదేశ్ ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన అనధికారిక టెస్టులో రెండు సెంచరీలు సాధించాడు. రజత్ పాటిదార్ మిడిల్ ఆర్డర్‌లో చోటు సంపాదించవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. శ్రేయాస్ అయ్యర్ కూడా స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టుతో వెళ్తున్నాడు. కాబట్టి రజత్ పాటిదార్‌కు చోటు దక్కడం ఖాయం.

సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్..

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు, టీమిండియా బ్యాట్స్‌మెన్ దీపక్ హుడా గాయపడ్డాడు. వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అలాగే మహమ్మద్ షమీ కూడా కోవిడ్ నుంచి కోలుకోలేకపోయాడు. దీని కారణంగా ఉమేష్ యాదవ్ టీ20 జట్టులో చేరాడు. ఎడమచేతితో స్పిన్‌ బౌలింగ్‌ చేయడంతోపాటు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న షాబాజ్‌ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు.

రేపే తొలి టీ20..

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 28న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. దీంతో ఇరు జట్లకు మూడు రోజుల విరామం లభించింది. రెండో టీ20 అక్టోబరు 2న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో, మూడో మ్యాచ్ అక్టోబర్ 4న ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మూడు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టు-

రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), రవి అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమేష్ యాదవ్ హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

భారత్‌తో సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు..

టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జన్మాన్ మలన్, ఐదాన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, తబ్సోరిజ్ రైస్‌బాసి.