అనుకున్నదే అయ్యింది.. విరాట్ టీమ్‌మేట్ ఎంట్రీ.. చివరి టెస్టుకు టీమిండియా జట్టు ఇదే.!

|

Mar 07, 2024 | 9:36 AM

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో తలబడేందుకు సిద్దమైంది టీమిండియా. ఇప్పటికే 5 టెస్టుల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్.. ఆఖరి టెస్టులోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు ఇంగ్లాండ్ అయితే 5వ టెస్టులో..

అనుకున్నదే అయ్యింది.. విరాట్ టీమ్‌మేట్ ఎంట్రీ.. చివరి టెస్టుకు టీమిండియా జట్టు ఇదే.!
England Vs India
Follow us on

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో తలబడేందుకు సిద్దమైంది టీమిండియా. ఇప్పటికే 5 టెస్టుల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్.. ఆఖరి టెస్టులోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు ఇంగ్లాండ్ అయితే 5వ టెస్టులో విజయం సాధించి.. సిరీస్‌కు ముగింపు పలకాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. తొలుత బ్యాటింగ్ చేసేందుకు సిద్దపడ్డాడు.

గత మ్యాచ్‌లో అదరగొట్టే హాఫ్ సెంచరీ చేసిన ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక టీమిండియాలో ఆకాష్‌దీప్ స్థానంలో స్పీడ్‌స్టర్ జస్ప్రిత్ బుమ్రా.. రజిత్ పటిదార్ స్థానంలో దేవదూత్ పడిక్కల్ తొలిసారి టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అటు ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇది 100వ టెస్ట్ కాగా.. ఇరు జట్ల సభ్యులు వీరికి స్పెషల్ విషెస్ చెప్పారు.

టీమిండియా(ప్లేయింగ్ ఎలెవన్) – రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, దేవదూత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా

ఇంగ్లాండ్(ప్లేయింగ్ ఎలెవన్) – జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పొప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హర్ట్లీ, షోయిబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్