T20 World Cup 2024: భారత్, పాక్ పోరుకు రంగం సిద్ధం.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే..

|

Aug 27, 2024 | 7:00 AM

T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో కాకుండా యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ నిన్న అంటే సోమవారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. టోర్నమెంట్ UAE, దుబాయ్, షార్జాలోని రెండు స్టేడియంలలో నిర్వహించనున్నారు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరుగుతుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం, టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరగనుంది.

T20 World Cup 2024: భారత్, పాక్ పోరుకు రంగం సిద్ధం.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే..
T20 World Cup 2024
Follow us on

T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో కాకుండా యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ నిన్న అంటే సోమవారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. టోర్నమెంట్ UAE, దుబాయ్, షార్జాలోని రెండు స్టేడియంలలో నిర్వహించనున్నారు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరుగుతుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం, టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరగనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. అన్ని జట్లు ఒక్కొక్కటి 4 గ్రూప్ మ్యాచ్‌లు ఆడతాయి. దీని ప్రకారం టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి.

టోర్నీలో పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంకలు గ్రూప్-ఎలో ఉండగా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ గ్రూప్-బిలో ఉన్నాయి. టోర్నీ సెమీఫైనల్ అక్టోబర్ 17, 18 తేదీల్లో జరగనుండగా, ఫైనల్ అక్టోబర్ 20న దుబాయ్‌లో జరగనుంది.

భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడంటే..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. కాబట్టి, గ్రూప్ దశలో రెండు జట్ల మధ్య పోటీ ఉంటుంది. ఈ మ్యాచ్‌ భారత్‌-పాకిస్థాన్‌ మధ్య అక్టోబర్‌ 3న మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. దుబాయ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో ఇరు జట్లు తలపడగా, అక్కడ టీమ్‌ఇండియా సులువుగా గెలిచింది.

తేదీ

ఏ జట్టుతో పోటీ

వేదిక

సమయం

అక్టోబర్ 3 బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్ షార్జా మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 3 పాకిస్థాన్ vs శ్రీలంక షార్జా సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 4 దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ దుబాయ్ , మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 4 ఇండియా vs న్యూజిలాండ్ దుబాయ్ సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 5 బంగ్లాదేశ్ vs ఇంగ్లండ్ షార్జా మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 5 ఆస్ట్రేలియా vs శ్రీలంక షార్జా సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 6 భారత్ vs పాకిస్థాన్ దుబాయ్ మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 6 వెస్టిండీస్ vs స్కాట్లాండ్ దుబాయ్ సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 7 ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా షార్జా సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 8 ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ షార్జా సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 9 దక్షిణాఫ్రికా vs స్కాట్లాండ్ దుబాయ్ మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 9 భారత్ vs శ్రీలంక దుబాయ్ సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 10 బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ షార్జా సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 11 ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ దుబాయ్ సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 12 న్యూజిలాండ్ vs శ్రీలంక షార్జా మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 12 బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా దుబాయ్ సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 13 ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్ షార్జా మధ్యాహ్నం 2 గంటలకు
అక్టోబర్ 13 ఇండియా vs ఆస్ట్రేలియా షార్జా సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 14 పాకిస్థాన్ vs న్యూజిలాండ్ దుబాయ్ సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 15 ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ దుబాయ్ సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 17 సెమీఫైనల్ 1 దుబాయ్ సాయంత్రం 6 గంటలకు
అక్టోబర్ 18 సెమీఫైనల్ 2 షార్జా సాయంత్రం 6 గంటలకు
20 అక్టోబర్ ఫైనల్ దుబాయ్ సాయంత్రం 6 గంటలకు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..