Hardik Pandya: వన్డే సిరీస్‌కి హార్దిక్ పాండ్యా దూరం.. భార్యతో విడాకుల కోసమేనా?

|

Jul 16, 2024 | 5:28 PM

IND vs SL Series: జులై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ముందుగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లోని వన్డేలకు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండకపోవచ్చు.

Hardik Pandya: వన్డే సిరీస్‌కి హార్దిక్ పాండ్యా దూరం.. భార్యతో విడాకుల కోసమేనా?
Hardik Pandya Vs Sl Odi Series
Follow us on

Hardik Pandya: శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉండబోనని హార్దిక్ పాండ్యా బీసీసీఐకి తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్‌లో పాల్గొనలేనంటూ చెప్పేశాడు. దీంతో వన్డే జట్టు ఎంపికకు నన్ను పరిగణనలోకి తీసుకోవద్దని పాండ్యా చెప్పినట్లు సమాచారం. కాబట్టి శ్రీలంకతో వన్డే సిరీస్‌లో హార్దిక్ కనిపించడని చెప్పొచ్చు. అయితే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడు.

జులై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా టీ20 జట్టుకు శాశ్వత కెప్టెన్‌గా పాండ్యా ఎంపికయ్యే అవకాశం ఉంది.

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా తరపున వన్డే క్రికెట్ ఆడలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడి టోర్నీ నుంచి సగంలోనే నిష్క్రమించాడు. అలాగే ఈ ఐపీఎల్ ద్వారా పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వచ్చాడు. అందుకు తగ్గట్టుగానే ఈ టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా కనిపించిన హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

వ్యక్తిగత జీవితం అల్లకల్లోలం..

ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ మధ్య హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం చర్చనీయాంశమైంది. పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ మధ్య వ్యవహారం చెడింది. అలాగే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్‌లో తాను పాల్గొనలేనని హార్దిక్ పాండ్యా చెప్పడం ఆసక్తికరంగా మారింది.

భారత జట్టు ఎంపిక..

శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు భారత జట్టును మంగళవారం ఎంపిక చేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ సభ్యులు చర్చించారు. అలాగే జట్టులో ఎవరెవరు ఉండాలన్న పూర్తి సమాచారాన్ని గంభీర్ సెలక్టర్లకు తెలిపాడు.

రోహిత్ – విరాట్ అందుబాటులో లేరా?

శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరంగా ఉండాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిర్ణయించారు. కానీ, సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోచ్ గంభీర్ సెలక్షన్ కమిటీకి తెలిపాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ సిరీస్‌ల మధ్య 6 వారాల విరామం ఉంది. ఈ సమయంలో సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవచ్చు. కాబట్టి శ్రీలంకతో జరిగే సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయాలని గౌతమ్ గంభీర్ చెప్పినట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..