Dhoni x Gambhir: కోచ్ సాబ్ నవ్వితే భలే ఉంది.. గంభీర్‌పై ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్.. రిప్లై చూస్తే మైండ్ బ్లాకే

Dhoni x Gambhir: టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన టీమిండియాను ధోనీ అభినందిస్తూ గంభీర్ నవ్వుపై చమత్కరించారు. దీనికి గంభీర్ స్పందిస్తూ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య పడదని, మనస్పర్థలు ఉన్నాయని గత కొన్నేళ్లుగా వస్తున్న వార్తలకు ఈ ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చెక్ పెట్టింది.

Dhoni x Gambhir: కోచ్ సాబ్ నవ్వితే భలే ఉంది.. గంభీర్‌పై ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్.. రిప్లై చూస్తే మైండ్ బ్లాకే
Dhoni X Gambhir

Updated on: Mar 09, 2026 | 6:33 PM

Dhoni x Gambhir: భారత క్రికెట్ అభిమానులకు ఇది డబుల్ ధమాకా. ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక గెలుపు ఒక ఎత్తైతే.. టీమిండియా ఇద్దరు దిగ్గజాలు, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరి మధ్య పడదని, మనస్పర్థలు ఉన్నాయని గత కొన్నేళ్లుగా వస్తున్న వార్తలకు ఈ ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చెక్ పెట్టింది.

భారత్ వరల్డ్ కప్ గెలవగానే ఎంఎస్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టాడు. అందులో ధోనీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నేరుగా పేరు చెప్పనప్పటికీ.. “కోచ్ సాబ్.. మీ ముఖం మీద నవ్వు చాలా బాగుంది. ఆ చిరునవ్వుతో కూడిన గాంభీర్యం కలయిక అద్భుతం!” అంటూ ధోనీ చమత్కరించాడు. గంభీర్ సాధారణంగా సీరియస్‌గా ఉంటాడనే విషయాన్ని ధోనీ తనదైన శైలిలో గుర్తు చేస్తూ అభినందించడం అభిమానులను ఖుషీ చేసింది.

ధోనీ పెట్టిన ఈ పోస్ట్‌కు గౌతమ్ గంభీర్ వెంటనే స్పందించాడు. “నవ్వడానికి ఇంతకంటే మంచి కారణం ఏముంటుంది? మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది!” అంటూ గంభీర్ రిప్లై ఇచ్చాడు. గంభీర్ చేసిన ఈ కామెంట్ కేవలం 3 గంటల్లోనే 60 వేలకు పైగా లైకులను సొంతం చేసుకుంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ స్వీట్ మూమెంట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. “మేము చూడాల్సింది ఇదే.. వరల్డ్ కప్ గెలుపు మాకు ఈ అద్భుతమైన క్షణాన్ని బహుమతిగా ఇచ్చింది” అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. వైట్ బాల్ క్రికెట్‌లో గంభీర్ కోచింగ్ టీమిండియాకు బాగా అ కలిసి వచ్చింది. గంభీర్ సారథ్యంలో భారత్ ఇప్పటికే 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు తాజాగా 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుని గంభీర్ తన కోచింగ్ పవర్‌ను నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ, గంభీర్ వ్యూహాలు వెరసి భారత్ ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా వెలుగొందుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us