IPL 2024: ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ మాకు టిక్కెట్లు ఇప్పిస్తారా: ఫాన్స్‌ను కోరిన టీమిండియా స్టార్ ప్లేయర్..

|

Mar 19, 2024 | 9:18 AM

IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ఆర్ అశ్విన్ తన పిల్లలను ఓపెనింగ్ వేడుకకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఈ వేడుకకు క్రేజ్, పెరుగుతున్న డిమాండ్ మధ్య, టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రవిచంద్రన్ అశ్విన్ కూడా టిక్కెట్లు కోసం కష్టపడుతున్నాడు. అతను సోషల్ మీడియాలో ఈవెంట్‌కు హాజరు కావాలనే తన పిల్లల కోరికను వ్యక్తం చేశాడు. టిక్కెట్లు పొందడానికి తన మాజీ బృందాన్ని కూడా సంప్రదించాడు.

IPL 2024: ఐపీఎల్ ప్రారంభోత్సవం చూడాలని ఉంది.. ప్లీజ్ మాకు టిక్కెట్లు ఇప్పిస్తారా: ఫాన్స్‌ను కోరిన టీమిండియా స్టార్ ప్లేయర్..
R Ashiwn
Follow us on

R Ashwin: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి చాలా మంది అభిమానులు టిక్కెట్లు సంపాదించే పనిలో పడ్డారు. అలాగే, ప్రారంభ వేడుకలను చూసేందుకు క్యూ కట్టారు. ఇప్పటికే కొంతమంది అభిమానులు టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఓపెనింగ్ సెర్మనీ లేదా తొలి మ్యాచ్ టిక్కెట్లు దక్కుతాయని ఆశతో ఉన్నవారు మరికొందరు. ఈ ఐపీఎల్ 2024 వేడుకకు క్రేజ్, పెరుగుతున్న డిమాండ్ మధ్య, టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రవిచంద్రన్ అశ్విన్ కూడా టిక్కెట్లు కోసం కష్టపడుతున్నాడు. అతను సోషల్ మీడియాలో ఈవెంట్‌కు హాజరు కావాలనే తన పిల్లల కోరికను వ్యక్తం చేశాడు. టిక్కెట్లు పొందడానికి తన మాజీ బృందాన్ని కూడా సంప్రదించాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌కు విజ్ఞప్తి..

ప్రారంభ వేడుక తర్వాత, సీజన్‌ను ప్రారంభించేందుకు దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన రెండు జట్లు, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై-బెంగుళూరు మధ్య టిక్కెట్ల సందడి ఎక్కువైందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. నా పిల్లలు ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ నాకు సహాయం చేయండి అంటూ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

2010, 2011లో IPL టైటిల్‌ను గెలుచుకున్న CSK జట్టులో అశ్విన్ ఒక భాగం. అతను 2008 నుంచి 2015 వరకు జట్టు కోసం ఆడాడు. డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా తర్వాత ఆల్ టైమ్ అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్. అతను 121 మ్యాచ్‌లలో 6.66 ఎకానమీ రేట్, 21.7 స్ట్రైక్ రేట్‌తో 120 వికెట్లు తీశాడు.

ఇంగ్లండ్‌ సిరీస్‌లో సత్తా చాటిన అశ్విన్‌..

భారత్-ఇంగ్లండ్ మధ్య ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అశ్విన్ చివరిసారిగా కనిపించాడు. అతను 24.8 సగటు, 36.11 స్ట్రైక్ రేట్‌తో 26 వికెట్లతో సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన నంబర్ 1 బౌలర్. ఇందులో అతని పేరు మీద రెండుసార్లు ఐదు వికెట్లు, అలాగే, 5/51 అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి.

భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ఇప్పుడు IPL 2024లో రాజస్థాన్ రాయల్స్ (RR) తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు మార్చి 24న సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..