10 నిమిషాల్లో రూ. 2.63 కోట్లు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి, ఎవరిదో తెలుసా?

|

Dec 04, 2024 | 2:48 PM

Don Bradman Baggy Green Cap: క్రికెట్ మైదానంలో "ది డాన్"గా పిలుచుకునే బ్రాడ్‌మాన్ 2001లో 92 సంవత్సరాల వయసులో మరణించాడు. అయితే, అతని 20 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో చేసిన రికార్డులు ఇప్పటికీ అతన్ని చిరస్థాయిగా నిలిపాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

10 నిమిషాల్లో రూ. 2.63 కోట్లు.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి, ఎవరిదో తెలుసా?
Bradmans Baggy Green Cap
Follow us on

Don Bradman: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ బ్యాగీ క్యాప్ పది నిమిషాల్లోనే రూ.2.63 కోట్లకు వేలంలో అమ్ముడైంది. 1947-48లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ప్రసిద్ధ ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ సిడ్నీలో వేలం వేశారు. దిగ్గజ క్రికెటర్ ఈ అరుదైన క్యాప్ 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో $ 479,700 (రూ. 2.63 కోట్లు) వేలంలో ఊహించని ధరను దక్కించుకుంది. అదే టోపీని ధరించి, బ్రాడ్‌మాన్ కేవలం 6 ఇన్నింగ్స్‌లలో 178.75 సగటుతో 715 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి.

ఫాక్స్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రత్యేకమైన క్యాప్‌ను బ్రాడ్‌మాన్ స్వయంగా భారత టూర్ మేనేజర్ పంకజ్ “పీటర్” కుమార్ గుప్తాకు బహుమతిగా ఇచ్చాడు. ఈ టోపీని బోన్‌హామ్స్ వేలం వేశారు.

రూ. 2.63 కోట్లకు అమ్ముడుపోయి ఇప్పుడు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్ వస్తువుగా నిలిచింది. క్రికెట్ చరిత్రలో డాన్ బ్రాడ్‌మన్ గొప్ప బ్యాట్స్‌మెన్ అనే సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా తరపున 52 టెస్టులు ఆడిన బ్రాడ్‌మన్ 2 ట్రిపుల్ సెంచరీలు, 12 డబుల్ సెంచరీలు, 29 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలతో 6996 పరుగులు చేశాడు. అంటే, అతని బ్యాటింగ్ సగటు 99.94లుగా నిలిచింది. క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక పరుగుల సగటు ఇదే కావడం గమనార్హం.

క్రికెట్ మైదానంలో “ది డాన్” అని పిలుచుకునే బ్రాడ్‌మాన్ 2001లో 92 సంవత్సరాల వయసులో మరణించాడు. అయితే, అతని 20 ఏళ్ల టెస్టు కెరీర్‌లో చేసిన రికార్డులు ఇప్పటికీ అతన్ని చిరస్థాయిగా నిలిపాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..