India vs Australia : ఆటగాళ్లు గాయాల బారిన పడటానికి ఐపీఎల్ కారణం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కోచ్

|

Jan 13, 2021 | 5:28 PM

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్ ను గాయాల బెడద వదలడంలేదు. ఇరు జట్ల ప్లేయర్స్ వరుసగా గాయాలబారిన పడుతుండటం..

India vs Australia : ఆటగాళ్లు గాయాల బారిన పడటానికి ఐపీఎల్ కారణం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కోచ్
Follow us on

India vs Australia : ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్ ను గాయాల బెడద వదలడంలేదు. ఇరు జట్ల ప్లేయర్స్ వరుసగా గాయాలబారిన పడుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అయితే ఆటగాళ్లు గాయాల బారిన పడటంపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్‌ లాంగర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఆటగాళ్లు గాయాలబారిన పడటానికి ఐపీఎల్ కారణమని జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా అతడు మాట్లాడుతూ.. వన్డే సిరీస్‌తో మొదలైన గాయాల బెడద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదట మా జట్టు ఆటగాళ్లు గాయాల బారిన పడగా.. ఇప్పుడు టీమిండియా వంతు అన్నట్టుగా మారిందని అన్నాడు.

మాటీమ్ లో వన్డే సిరీస్‌, టీ20 సందర్భంగా మా జట్టు తరపున డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ స్టొయినిస్‌లు గాయపడగా.. టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందే కామెరాన్‌ గ్రీన్‌, విల్‌ పకోవ్‌స్కీ కి గాయాలు అయ్యాయి. ఇక టీమిండియాలో షమీ, ఉమేశ్‌, జడేజా, కేఎల్‌ రాహుల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రాలు గాయపడ్డారు. దీనితోపాటు తొడకండరాలు పట్టేయడంతో అశ్విన్ నాలుగో టెస్ట్ కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఐపీఎల్‌ వల్లే జరిగింది. ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌ర‌గ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌నేది నా అభిప్రాయం. అయితే తాను ఐపీఎల్‌ను తప్పు బట్టడం లేదని.. కేవలం ఐపీఎల్‌ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు జస్టిన్‌ లాంగర్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nathan Lyon’s : అడుగు దూరంలో.. అరుదైన రికార్డులకు చేరువలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్

India Vs Australia 2020: ఆసీస్‌లో మనోళ్ల కష్టాలు.. బీసీసీఐకి కంప్లయింట్ ఇచ్చిన రహనే అండ్ కో..