Nathan Lyon’s : అడుగు దూరంలో.. అరుదైన రికార్డులకు చేరువలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు.  టీమిండియాతో జరుగనున్న నాలుగో టెస్టులో ఈ ఘటన నాథన్ సొంతం కానుంది.

  • Sanjay Kasula
  • Publish Date - 5:04 pm, Wed, 13 January 21
Nathan Lyon's : అడుగు దూరంలో.. అరుదైన రికార్డులకు చేరువలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్

Nathan Lyon’s : ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు.  టీమిండియాతో జరుగనున్న నాలుగో టెస్టులో ఈ ఘటన నాథన్ సొంతం కానుంది. ఆస్ట్రేలియా తరఫున 100 టెస్టులాడిన జాబితాలో చేరనున్నాడు. దీంతో వంద టెస్టులు ఆడిన 13వ ఆస్ట్రేలియన్​​ క్రికెటర్​గా నిలవనున్నాడు.

స్పిన్నర్ నాథన్ లియోన్. భారత్​తో బ్రిస్బేన్​లో ఆడబోయే మ్యాచ్​తో ఈ ఘనత సాధించనున్నాడు. బోర్డర్-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా జరుగనున్న ఆఖరి టెస్టు జనవరి 15న బ్రిస్బేన్​ వేదికగా ప్రారంభం కానుంది.

అంతర్జాతీయ టెస్టుల్లో తన ప్రయాణంపై లియోన్​ రియాక్ట్ అయ్యాడు. చాలా ఆనందంగా ఉందంటూ పేర్కొన్నాడు. కానీ, అస్సలు గర్వంగా భావించడం లేదని అన్నాడు. అంతే కాదు.. టెస్టుల్లో 400 వికెట్ల మైల్ స్టోన్‌కి చేరువలో ఉన్నాడు. ఇప్పటికే 396 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. భారత్​తో నాలుగో టెస్టులో ఈ ఘనత సాధిస్తానని ఆశాభావంతో ఉన్నాడు.