సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. గోవా తరఫున ఆడుతూ, అతను వైట్ బాల్ క్రికెట్‌లో 50 వికెట్లు పూర్తి చేశాడు. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన అర్జున్, తన ప్రదర్శనతో మరోసారి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన అర్జున్ అందులో అంతగా రాణించలేకపోయాడు. మొన్న ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అంతగా మెప్పించలేకపోయాడు. గతంలో ముంబై క్రికెట్ జట్టుతో ప్రారంభించినప్పటికీ, తన కెరీర్‌ను నిలకడగా గోవాలో కొనసాగిస్తున్నాడు.
ఇక జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా తమ తమ మైలురాయిలను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బుమ్రా 200 టెస్ట్ వికెట్ల ఘనతను చేరుకునేందుకు కేవలం ఆరు వికెట్ల దూరంలో ఉండగా, జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లకు సమీపంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇరు జట్లు బాక్సింగ్ డే టెస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి, ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరేందుకు ఇది కీలకమైంది.
బుమ్రా ఇప్పటివరకు ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో 21 వికెట్లు సాధించి బౌలింగ్‌లో దుమ్ము రేపాడు. జడేజా తన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాలను సాధించాడు. వీరి ప్రదర్శన భారత జట్టుకు కొత్త విజయాలకు నాంది కానుంది.