ఆర్సీబీ కెప్టెన్‌గా రోహిత్.. ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే..!

|

Oct 06, 2024 | 3:10 PM

2025 ఐపీఎల్ సీజన్ ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అనేది చర్చ నడుస్తుంది. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యాను తీసుకొని యాజమాన్యం కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ హార్ధిక్ నాయకత్వంలో ఇమడలేకపోతున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్‌ను ఆర్సీబీ తమ జట్టులోకి తీసుకొని కెప్టెన్‌గా నియమించాలనే యెచనలో ఉన్నట్లు ఆర్సీబీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్సీబీ కెప్టెన్‌గా రోహిత్..  ఏబీ డివిలియర్స్ ఏమన్నాడంటే..!
Ab De Villiers On Rohit Sha
Follow us on

ఐపీఎల్‌లో మోస్ట్ పాపులర్ జట్టు ఏది అని అడిగితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అని ఎవరైనా నిర్మోహమాటంగా చెబుతారు. ‘ఈ సాలా కప్‌ నమదే’ డైలాగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. ప్రతీ సీజన్ ఈ సారి కప్ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలని దూకుడుతో రంగంలోకి దిగుతుంది ఆర్సీబీ.. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ కొట్టాకపోయిన కానీ ఆర్సీబీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం కొదువలేదు. 2024 సీజన్‌లో ఆర్సీబీ పని అయిపోయింది అని అందరూ అనుకుంటుండగా అనూహ్యంగా మళ్లీ పుంజుకొని బ్యాక్ టూ బ్యాక్ మ్యాచ్లు ఆడి ప్లే ఆఫ్‌కి క్వాలిఫై అయి ప్రత్యర్థి జట్టులకు షాక్ ఇచ్చింది. ఆర్సీబీ ఇప్పటి వరకు కప్ గెలువలేదు కానీ తమ హృదయాలను గెలిచిదని తరచూ ఫ్యాన్స్ ఆర్సీబీని వెనకేసుకొని వస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే 2025 ఐపీఎల్ సీజన్ ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అనేది చర్చ నడుస్తుంది. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యాను తీసుకొని యాజమాన్యం కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ హార్ధిక్ నాయకత్వంలో ఇమడలేకపోతున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్‌ను ఆర్సీబీ తమ జట్టులోకి తీసుకొని కెప్టెన్‌గా నియమించాలనే యెచనలో ఉన్నట్లు ఆర్సీబీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా బీసీసీఐ ఆర్‌టీఎమ్, రిటెన్షన్‌లపై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా రైట్ టు మ్యాచ్ నిబంధనతో రోహిత్‌ను ఆర్సీబీ యజమాన్యం తీసుకోవాలని ప్రయత్నించినట్లు టాక్ వినిపించింది. ఈ విషయంపై తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.

ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. ఆర్సీబీ జట్టు ఫాఫ్‌ డుప్లెసిస్‌ను తమతో పెట్టుకొని కెప్టెన్‌గా కొనసాగిస్తే మంచిదని సూచించాడు. డుప్లెసిస్‌‌‌కి వయస్సు పెరిగిపోయిందని కొందరు అంటున్నారని, అతనికి కేవలం 40 సంవత్సరాలు మాత్రమేనని, వయస్సు అనేది ఓ సంఖ్య మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డుప్లెసిస్‌‌‌ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇంకా డుప్లెసిస్‌ మరిన్నో సీజన్లు ఆడుతాడన్నారు. డుప్లెసిస్‌‌‌ ఆర్సీబీకి ఒక్కసారి కప్ అందించలేకపోయాడని, అతనికి అదే ఒత్తిడి కలిగించే ఆంశం అని తెలిపారు. ఈ విషయంలో డుప్లెసిస్‌‌ను విరాట్ కోహ్లీ అండగా నిలుస్తాడని అనుకుంటున్నట్లు చెప్పారు. డుప్లెసిస్‌‌ కెప్టెన్‌గా కొనసాగడం కోహ్లికి ఇష్టమేనని చెప్పుకొచ్చారు. రోహిత్ ముంబై జట్టును వదిలి ఆర్‌సీబీకి వస్తే మంచిదేనని, కానీ అలాంటిది ఏమి జరగకపోవచ్చని తెలిపాడు.