Value Gold: టెన్షన్‌ ఎందుకు దండగా.. ఇంట్లో బంగారం ఉండాగా.. ‘వాల్యూ గోల్డ్‌’ గోల్డెన్‌ ఛాన్స్‌

| Edited By: Shaik Madar Saheb

Aug 13, 2024 | 5:23 PM

వాల్యూగోల్డ్‌ ముఖ్యంగా మూడు దశల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. ఇందులో మొదటిది బంగారాన్ని తీసుకొచ్చి, దాని నాణ్యతను తెలుసుకోవడం. ఇక రెండోది బెటర్‌ వాల్యు కోసం కరిగించడం, మూడోది వెంటనే మీ ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం. ఆరోజు మార్కెట్‌ రేట్‌ ఎంత ఉందో అంత మొత్తాన్ని వినియోగదారులకు అందిస్తారు.

Value Gold: టెన్షన్‌ ఎందుకు దండగా.. ఇంట్లో బంగారం ఉండాగా.. వాల్యూ గోల్డ్‌ గోల్డెన్‌ ఛాన్స్‌
Value Gold
Follow us on

బంగారాన్ని భారతీయులను విడదీసి చూడలేము. ఏడాది బోనస్‌ వస్తే చాలు, వ్యాపారాల్లో కాస్త లాభం ఎక్కువ వచ్చినా చాలు వెంటనే ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసే వారు చాలా మంది ఉంటారు. బంగారం కేవలం అభరణంగా మాత్రమే కాకుండా, పెట్టుబడి మార్గంగా భావించే వారు కూడా చాలా మంది ఉంటారు. ఉన్నపలంగా ఏదైనా అనుకొని కష్టం వచ్చినా ఇంట్లో బంగారం ఉంటే ఆ ధీమానే వేరు. అందుకే ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే అవసరానికి బంగారాన్ని అమ్మేయ్యాలంటేనే సమస్య వచ్చి పడుతుంది. తక్కువ ధరకు విక్రయిస్తున్నామా.? నష్టపోతున్నామా.? అనే సందేహాలు తలెత్తుతాయి. అలాంటి వారి కోసమే ‘వ్యాల్యూ గోల్డ్‌’ అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చింది.

క్యాప్స్‌ గోల్డ్‌కు చెందిందే ఈ వ్యాల్యూ గోల్డ్‌.. క్యాప్స్‌ గోల్డ్ సంస్థను 1901 లో స్థాపించారు.. గత 70 ఏళ్లుగా బులియన్ మార్కెట్, రిటైల్ జ్యువెలరీ, బంగారు ఆభరణాల తయారీ, గోల్డ్ రిఫైనరీ రంగాల్లో సేవలను అందిస్తోంది. బంగారాన్ని డబ్బుగా మార్చుకోవాలనుకునే వారి అవసరాలను తీరుస్తూ ముందుకు సాగుతోంది వ్యాల్యూ గోల్డ్‌.. బంగారం నాణ్యతను గుర్తించడానికి ఇందులో అడ్వాన్స్‌డ్‌ XRF టెక్నాలజి మిషిన్స్‌ను ఉపయోగిస్తారు.దీంతో కచ్చితమైన నాణ్యత తెలుస్తుంది. ఇది బంగారం అమ్మాలనుకునే వారికి సరైన ధర లభించేందుకు దోహదపడుతుంది. పై చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం, అత్యవసర సేవల కోసం.. ఇలా దేనికైనా బంగారాన్ని విక్రయించి వెంటనే డబ్బులు పొందే అవకాశాన్ని వ్యాల్యూ గోల్డ్ కల్పిస్తుంది.

వాల్యూగోల్డ్‌ ముఖ్యంగా మూడు దశల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. ఇందులో మొదటిది బంగారాన్ని తీసుకొచ్చి, దాని నాణ్యతను తెలుసుకోవడం. ఇక రెండోది బెటర్‌ వాల్యు కోసం కరిగించడం, మూడోది వెంటనే మీ ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం. ఆరోజు మార్కెట్‌ రేట్‌ ఎంత ఉందో అంత మొత్తాన్ని వినియోగదారులకు అందిస్తారు. వ్యాల్యూ గోల్డ్‌ సంస్థలో ఉన్న మరో అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే.. తాకట్టులో ఉన్న బంగారానికి అడ్వాన్స్‌ రూపంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. బంగారాన్ని విడిపించి మిగతా ప్రాసెస్ పూర్తికాగానే ఆ రోజు మార్కెట్‌ రేట్‌ కే కొని మిగిలిన డబ్బును వినియోగదారులకు అందిస్తారు.

వాల్యూ గోల్డ్ సంస్థ..తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బంగారం కొనుగోలు చేసే మొబైల్ వాహన కార్యాలయాన్ని (Mobile Gold Buying) వినియోగాదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల వారికి బంగారం కొనుగోలు సేవలను అత్యధిక పారదర్శకత, నాణ్యతావిలువలతో అందించటం కోసం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.. కరీంనగర్‌లో ప్రారంభించిన సేవలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో తెలంగాణ మొత్తం ఈ సేవలను విస్తరించడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది.

త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా మొబైల్ వాహన సేవలు అందించే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ మొబైల్ వాహనం వద్ద ప్రజలు ఉచితంగా తమ బంగారం నాణ్యత పరీక్షను నిర్వహించుకునే అవకాశం కల్పిస్తోంది. అంతేకాకుండా అన్ని వాల్యూ గోల్డ్‌ బ్రాంచులలో కూడా ఉచితంగా తమ బంగారం నాణ్యత పరీక్ష సేవలను వినియోగించుకోవచ్చు.. అన్ని వాల్యూ గోల్డ్‌ బ్రాంచులతో పాటు, మొబైల్ ఆఫీసుల్లో గోల్డ్‌ మరియు సిల్వర్‌ కాయిన్స్‌ను విక్రయిస్తున్నారు. మీ దగ్గర ఉన్న బంగారాన్ని చెల్లించి కూడా గోల్డ్‌ కాయిన్స్‌ను పొందొచ్చు.