Vastu Tips: ఈ దిశలో అరటి చెట్టును అస్సలు పెట్టకూడదు.. నాటితే ఎంత నష్టమో తెలుసా..

|

Sep 12, 2022 | 6:11 AM

Vastu Tips: వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో చెట్లు, మొక్కలు నాటేందుకు కొన్ని ప్రత్యేక నిబంధనలు పేర్కొనడం జరిగింది.

Vastu Tips: ఈ దిశలో అరటి చెట్టును అస్సలు పెట్టకూడదు.. నాటితే ఎంత నష్టమో తెలుసా..
Banana Plant
Follow us on

Vastu Tips: వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో చెట్లు, మొక్కలు నాటేందుకు కొన్ని ప్రత్యేక నిబంధనలు పేర్కొనడం జరిగింది. వాటిని అనుసరించకపోవడం వల్ల దాని దుష్ప్రభావాలను వ్యక్తులపై, వ్యక్తి కుటుంబంపై పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అరటి చెట్టును హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్టును నాటేందుకు కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని దిశలు, నియమాలు పేర్కొనడం జరిగింది. వీటిని అనుకరించకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అరటి చెట్టులో విష్ణువు, దేవగురువు బృహస్పతి నివసిస్తారని ప్రతీతి. ఈ చెట్టును నాటడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. అయితే, తప్పు దిశలో నాటితే మాత్రం జీవితాన్ని కష్టాలపాలు చేస్తుంది.

ఏ దిశలో అరటి చెట్టును నాటవద్దు..

1. వాస్తు శాస్త్రం ప్రకారం.. అరటి చెట్టును ఆగ్నేయ దిశలో నాటకూడదు. పడమర దిక్కున నాటినా కూడా అశుభ ఫలితాలను కలుగజేస్తుంది. అందుకే ఈ దిక్కులలో అరటి చెట్టను నాటకుండా ఉండాలి.

ఇవి కూడా చదవండి

2. ఇంటి ప్రధాన ద్వారం ముందు అరటి చెట్టును నాటకూడదు. వాస్తు ప్రకారం, ఇది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశానికి ఆటంకం కలిగిస్తుంది. ఇంట్లోకి వచ్చే సంతోషం, శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది.

3. అరటిచెట్టు దగ్గర ముళ్ల మొక్కలను ఎప్పుడూ నాటకూడదు. అరటిచెట్టు దగ్గర గులాబీలు లేదా కాక్టస్ వంటి మొక్కలను నాటొద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చీలికలు జరుగుతాయి.

4. అరటి చెట్టులో లక్ష్మి దేవి, విష్ణువు ఉంటారని విశ్వాసం. వారి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే అరటి ఆకులను ఎండిపోనివ్వద్దు. అరటి చెట్టును ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ చెట్టుకు ఎప్పుడూ మురికి నీరు పోయొద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..