Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం.. పౌర్ణమి నాడు పూజకు శుభ సమయాలు ఇవే.. ఎప్పుడు చేసుకోవాలంటే?

August 28 Varalakshmi Vratam Telugu: ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం చేసుకోలేకపోయారా? అయితే పౌర్ణమితో కలిసి వచ్చే ఆగస్టు 28, శుక్రవారం కూడా వ్రతం చేసుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈరోజు వరలక్ష్మీ పూజకు అనుకూలమైన సమయాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం.. పౌర్ణమి నాడు పూజకు శుభ సమయాలు ఇవే.. ఎప్పుడు చేసుకోవాలంటే?
August 28 Varalakshmi Vratam Telugu

Updated on: Aug 27, 2026 | 1:44 PM

Shravana Varalakshmi Vratam Telugu: శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. సాధారణంగా శ్రావణ మాసంలోని రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆగస్టు 21న వ్రతం చేసుకోలేని భక్తులు.. పౌర్ణమితో కలిసి వచ్చే ఆగస్టు 28, శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకుంటే ఏ సమయంలో పూజ ప్రారంభించాలి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రామాణిక గ్రంథాల ప్రకారం, శ్రావణ మాసంలోని రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే.. పౌర్ణమితో కూడిన శుక్రవారం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఆగస్టు 28న వరలక్ష్మీ వ్రతానికి శుభ సమయాలు

ఆగస్టు 28, శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలనుకునేవారికి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఉదయం 4:29 గంటల నుంచి 5:17 గంటల మధ్య పూజను ప్రారంభించుకోవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ తెల్లవారుజామునే పూజ చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటివారు ఉదయం 8:20 గంటలలోపు వరలక్ష్మీ వ్రత పూజను ప్రారంభించుకోవడం మంచిదని చెబుతున్నారు. ఉదయం 8:20 తర్వాత కొన్ని ప్రతికూల సమయాలు ఉండే అవకాశం ఉన్నందున, వీలైనంత వరకు ఈ సమయానికి ముందే పూజ పూర్తి చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

9:30 నుంచి 9:40 మధ్య కూడా పూజ ప్రారంభించవచ్చు

ఉదయం 8:20 గంటలలోపు పూజ చేసుకోవడం సాధ్యం కానివారు మరొక అనుకూల సమయాన్ని ఎంచుకోవచ్చు. ఉదయం 9:30 గంటల నుంచి 9:40 గంటల మధ్య పూజ ప్రారంభించి, ముందుగా దీపారాధన చేసుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే పూజను తప్పనిసరిగా ఈ కొద్ది నిమిషాల్లోనే ప్రారంభించాలనే నియమం లేదని, భక్తులు తమకు అనుకూలమైన సమయంలో వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించవచ్చని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం పూజ చేసుకోవాలనుకునేవారికి..

ఉదయం పూజ చేసుకోవడం వీలు కానివారు సాయంత్రం కూడా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా రాత్రి 7:43 గంటల నుంచి రాత్రి 9:23 గంటల వరకు ఉన్న అమృతకాలంలో పూజ చేసుకోవడం శుభప్రదంగా భావిస్తున్నట్లు జ్యోతిష్యులు వివరిస్తున్నారు. అందువల్ల ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం చేసుకోలేకపోయిన భక్తులు ఆగస్టు 28, పౌర్ణమి శుక్రవారం రోజున కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు. తమకు అనుకూలమైన శుభ సమయంలో అమ్మవారిని భక్తితో పూజించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకోవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు.

(Disclaimer: పూజా సమయాలు ప్రాంతాన్ని బట్టి స్వల్పంగా మారవచ్చు. కాబట్టి స్థానిక పంచాంగాన్ని కూడా పరిశీలించడం మంచిది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us