TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ విక్రయ కేంద్రాలు పెంపు.. అంతే కాకుండా..

|

Jan 15, 2023 | 6:42 AM

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుగిరులు జనసంద్రంగా మారుతున్నాయి. తిరుమల అనగానే ముందుగా గుర్తొచ్చేది శ్రీవారి లడ్డూలు. వాటిని పొందేందుకు...

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ విక్రయ కేంద్రాలు పెంపు.. అంతే కాకుండా..
Tirumala Laddu
Follow us on

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుగిరులు జనసంద్రంగా మారుతున్నాయి. తిరుమల అనగానే ముందుగా గుర్తొచ్చేది శ్రీవారి లడ్డూలు. వాటిని పొందేందుకు భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే.. రద్దీ కారణంగా ప్రస్తుతం ఉన్న లడ్డూ విక్రయ కేంద్రాలు సరిపోవడం లేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రసుత్తమున్న లడ్డూ విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డూల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు. భక్తుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు.

మరోవైపు.. తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించి భవనాల అద్దెను పెంచలేదని మరోసారి స్పష్టం చేశారు ఈవో ధర్మారెడ్డి. అవాస్తవాలను నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులు బసచేసే రూ.50, రూ.100 గదుల అద్దెను పెంచొద్దని కడపకు చెందిన సుబ్రహ్మణ్యం, అనంతపురానికి చెందిన వాణి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి విన్నవించారు. దీనికి స్పందించిన ఈవో.. సామాన్య భక్తులకు కేటాయించే గదుల అద్దె పెంచలేదని, వీఐపీలకు కేటాయించే 172 అతిథిగృహాల అద్దె పెంచామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి