Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు

దేవదేవుడు తిరుమల శ్రీవారికి నవంబర్ నెలలో జరుగబోతోన్న సేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టి.టి.డి ప్రజా సంబంధాల

Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు
Tirumala

Updated on: Oct 25, 2021 | 8:45 PM

Lord Venkateswara – Tirumala: దేవదేవుడు తిరుమల శ్రీవారికి నవంబర్ నెలలో జరుగబోతోన్న సేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. టి.టి.డి ప్రజా సంబంధాల అధికారి క్రతువులకు సంబంధించిన వివరాల్ని విడుదల చేశారు. న‌వంబ‌రు మాసంలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వదినాలు.. శ్రీవారి సేవల వివరాలు.. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

న‌వంబ‌రు 1న మ‌త‌త్రయ ఏకాద‌శి
న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం
న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌
న‌వంబ‌రు 8న నాగుల‌చ‌వితి సంద‌ర్భంగా పెద్దశేష వాహ‌నసేవ‌, శ్రీ మ‌న‌వాళ మ‌హాముని శాత్తుమొర‌
న‌వంబ‌రు 10న పుష్పయాగానికి అంకురార్పణ‌
న‌వంబ‌రు 11న పుష్పయాగం, శ్రీ వేదాంత దేశికుల శాత్తుమొర‌
న‌వంబ‌రు 16న కైశిక ద్వాద‌శి ఆస్థానం, చాతుర్మాస్య వ్రతం స‌మాప్తి
న‌వంబ‌రు 18న కృత్తికా దీపోత్సవం
న‌వంబ‌రు 19న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర‌

Read also: Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్

Loading...
Unable to load recommendations.
Follow Us