Chanakya Niti: ఈ వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!

|

Jul 05, 2022 | 2:06 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తాను రచించిన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించి అనేక విషయాలు పేర్కొన్నాడు.

Chanakya Niti: ఈ వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!
Chanakya Niti
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తాను రచించిన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించి అనేక విషయాలు పేర్కొన్నాడు. వీటిని పాటించడం ద్వారా వ్యక్తి తన లక్ష్యాన్ని సాధిస్తాడనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే.. కొందరు వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు ఆచార్య చాణక్య. లేదంటే వారి నుంచి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మరి చాణక్య ప్రకారం ఎవరికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మాటకు కట్టుబడి ఉండని వ్యక్తులు: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మీ ముందు పెద్ద విషయాలు మాట్లాడే వ్యక్తులు కొందరు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఏం చెప్పినా ఊ అంటూ తలూపాలి. అంతేతప్ప వారిని పట్టించుకుంటూ ఉండొద్దు. ఎందుకంటే.. కాలక్రమేణా వారు చెప్పిన మాటలు మాయం అవుతాయి. చేసిన వాగ్దానాలను వెనక్కి తీసుకుంటారు. అలాంటి వారితో లోతైన సంబంధాలు అస్సలు కొనసాగించొద్దు.

పొడిగేవారికి దూరంగా ఉండాలి: మీ చుట్టూ ఉండేవాళ్లలో చాలా మంది మిమ్మలని పొగిడేవాళ్లు ఉంటారు. వారు.. తమ పనిని పూర్తి చేసుకోవడానికి తరచుగా ఇలా ప్రశంసిస్తుంటారు. ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వారు మీ నుంచి ప్రయోజనం పొందాలని మాత్రమే ఇలా చేస్తుంటారని చాణక్య తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అబద్ధం చెప్పే వ్యక్తులకు దూరంగా ఉండాలి: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ప్రతిదానికి అబద్దం చెప్పే వారితో జీవించడం కూడా సరికాదు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. వీటి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి.