Chanakya Niti: ఈ విషయాలకు దూరంగా ఉండండి.. మహిళలకు చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా..

| Edited By: Anil kumar poka

Dec 09, 2021 | 2:53 PM

ఆచార్య చాణక్యుడు ఓ గొప్ప జ్ఞాని. అతను జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నాడు. వాటి నుండి చాలా అనుభవాలను నేర్చుకున్నాడు. ఆచార్యుడు..

Chanakya Niti: ఈ విషయాలకు దూరంగా ఉండండి.. మహిళలకు చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా..
Chanakya
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఓ గొప్ప జ్ఞాని. అతను జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నాడు. వాటి నుండి చాలా అనుభవాలను నేర్చుకున్నాడు. ఆచార్యుడు తన క్రియేషన్స్ ద్వారా తన అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. తన అనుభవాలను నీతి శాస్త్రంగా మార్చాడు. చాణక్యుడు రచించిన చాణక్య నీతి నేటికీ బాగా ప్రాచుర్యంలో ఉంది. అందులో రాసి ఉన్న విషయాలను పాటిస్తే అన్ని సమస్యలు దూరం అవుతాయని నమ్మకం.

అహంకారం అందరినీ నాశనం చేస్తుందని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. అందుకే అందరూ అహంకారానికి దూరంగా ఉండాలని తన నీతి గ్రంధంలో పేర్కొన్నాడు. కానీ స్త్రీలో ఈ అహం ఉన్నట్లైతే.. అది స్త్రీతోపాటు ఆమె నివసించే కుటుంబాన్ని నాశనం చేస్తుందని అంటాడు చాణక్యుడు. అహంకారంతో ఉండే స్త్రీ తన జ్ఞానాన్ని, ధనాన్ని కోల్పోతుంది. అంటే అహంకారం ఆ స్త్రీకి మాత్రమే కాకుండా.. వారి కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తుందని అభిప్రాయ పడ్డాడు చాణక్యుడు. అలాంటి స్త్రీ నివసించే ఇళ్లు కూడా ఆనందం.. శ్రేయస్సుకు దూరం అవుతాయి.

ఒక మహిళ ఎల్లప్పుడూ జ్ఞానంతో ఉండాలి. ఎందుకంటే విజ్ఞానం ఉన్న స్త్రీ విద్యావంతులైన తరాన్ని సృష్టిస్తుంది. దాని నుండి సమాజం కూడా ప్రయోజనం పొందుతుంది. ఈ విధంగా చూస్తే స్త్రీ విద్య సమాజానికి అవసరమని ఆచార్య వివరించారు.

కుటుంబాన్ని కలిపి ఉంచడంలో స్త్రీ పాత్ర ప్రధానమైంది. కానీ ఆమెలో అహకారం పెరిగితే స్వార్థపరురాలిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో కలహాలు పెరిగి ఆందోళన మొదలవుతుంది. దీని వల్ల ఇంట్లో సంతోషం, శాంతి కనిపించకుండా పోతాయి. ఆ ఇంట్లో ప్రతిదీ నాశనం అవుతుంది.

ఇవి కూడా చదవండి: Astro tips for wallet: మీ పర్సు ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?