Hyderabad: గణేశ్ మహారాజ్ కీ జై.. నినాదాలతో హోరెత్తనున్న మహానగరం.. వైభవ వేడుకలకు సమీపిస్తున్న గడువు

|

Aug 17, 2022 | 7:27 AM

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఉత్సవాలకు, పర్వదినాలకు కొదవ లేదు. భాగ్యనగరంలో బోనాల సందడి పూర్తయిన వెంటనే వినాయకచవితి ఉత్సవాలు ఊపందుకున్నాయి. మరికొద్దిరోజుల్లోనే మహా సంబరం మొదలు కానుంది. ఈ మేరకు అధికారులు,...

Hyderabad: గణేశ్ మహారాజ్ కీ జై.. నినాదాలతో హోరెత్తనున్న మహానగరం.. వైభవ వేడుకలకు సమీపిస్తున్న గడువు
Khairatabad Ganesh
Follow us on

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఉత్సవాలకు, పర్వదినాలకు కొదవ లేదు. భాగ్యనగరంలో బోనాల సందడి పూర్తయిన వెంటనే వినాయకచవితి ఉత్సవాలు ఊపందుకున్నాయి. మరికొద్దిరోజుల్లోనే మహా సంబరం మొదలు కానుంది. ఈ మేరకు అధికారులు, ప్రభుత్వం, నిర్వాహకులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కనీవినీ ఎరుగని మహా సంబరానికి హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న గణేశ్ ఉత్సవాలకు (Vinayaka Chavithi) సమయం దగ్గర పడుతోంది. ఈనెల 31నుంచే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవం ప్రారంభం కానుంది. గణపతి బప్పా మోరియా, జైబోలో గణేశ్ మహారాజ్ కీ జై అనే నినాదాలతో వాడవాడలు, గల్లీ గల్లీ హోరెత్తిపోనుంది. వినాయక మండపాలతో సందడి షురూ కానుంది. గణేశ్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై MCHRDలో రివ్యూ జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Minister Talasani Srinivas Yadav) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు, బాలాపూర్‌, ఖైరతాబాద్‌, భాగ్యనగర్‌ గణేశ్ ఉత్సవ కమిటీలు పాల్గొన్నాయి.

గణేశ్ ఉత్సవాలకు ఎప్పటిలాగే ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో చర్యలు చేపడుతున్నాం. అన్ని శాఖల సమన్వయంతో గణేశ్ ఉత్సవాలను వైభవంగా శాంతియుత వాతావరణలంలో నిర్వహించాలి. విగ్రహాల ఊరేగింపు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. GHMC ఆధ్వర్యంలో 4 లక్షలు, HMDA, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో రెండు లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నాం. నిమజ్జనోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడతున్నాం.

    – తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌లో గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్‌ మహా గణపతి ప్రస్థానం ఈ సారి 50 అడుగులకు చేరింది. శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా స్వామివారు దర్శనమివ్వనున్నారు. విగ్రహ తయారీ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..