అందుకే స్మిత్‌ బాల్ ట్యాంపరింగ్ నింద తనపై వేసుకున్నారు: ఆండ్రూ ఫ్లింటాఫ్‌

2018లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.

అందుకే స్మిత్‌ బాల్ ట్యాంపరింగ్ నింద తనపై వేసుకున్నారు: ఆండ్రూ ఫ్లింటాఫ్‌
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 6:52 AM

2018లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. కేప్‌టౌన్‌లో టెస్ట్ మ్యాచ్‌ సందర్భంగా సౌండ్ పేపర్‌తో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఘటనలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌తో పాటు డేవిడ్‌ వార్నర్‌ను సంవత్సరం పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక ఈ వివాదంపై తాజాగా ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ట్యాంపరింగ్ ఆసీస్‌ జట్టు సభ్యులందరికీ తెలిసే జరిగిందని ఆండ్రూ అన్నారు. అయితే ఈ ఉదంతం నుంచి తన జట్టును తప్పించేందుకు స్మిత్ నింద తనపై వేసుకున్నారని ఆయన చెప్పారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫ్లింటాఫ్‌.. ఆస్ట్రేలియా టీమ్‌కు తెలీకుండా బాల్ ట్యాంపరింగ్ జరిగిందంటే నేను నమ్మలేను. ఎవరైనా నాకు ఓ ట్యాంపరింగ్ చేసిన బాల్ ఇస్తే ఓ బౌలర్‌గా నాకు ఆ విషయం ప్రాథమికంగా తెలుస్తుంది. ఆస్ట్రేలియా జట్టుకు ఈ విషయం తెలీదంటే నమ్మను. ట్యాంపరింగ్ ఘటనలు చాలా సంవత్సరాలుగా సాగుతున్నాయి. బంతిపై స్వీట్ పూసి ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు మా జట్టుపై సైతం ఆరోపణలు వచ్చాయి. సౌండ్‌పేపర్‌తో ట్యాంపరింగ్‌కు పాల్పడటం తప్పే. అయితే ఆస్ట్రేలియా జట్టు సభ్యులందరూ ఈ ట్యాంపరింగ్‌లో ఏదో ఒక రకంగా పాలుపుంచుకోలేదంటే నేను నమ్మలేను అని ఫ్లింటాఫ్‌ వెల్లడించారు.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల కేసులు.. లక్ష 88 వేల మృతులు..

Latest Articles