బీహార్‌లో తీవ్ర విషాదం… ఆరుగురు మృతి!

బీహార్‌లోని  ఛాప్రా జిల్లా డొయిల్లా గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. ముగ్గురుని స్థానికులు రక్షించారు. మిగిలిన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. మొత్తం పదిమంది చిన్నారులు ఈతకు చెరువులోకి దిగగా ఆరుగురు మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి సంబంధించిన సూరజ్, అర్జున్, రాజా, సత్యం, బిట్టూ, చందన్‌గా గుర్తించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన పిల్లలు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:37 am, Mon, 29 July 19

బీహార్‌లోని  ఛాప్రా జిల్లా డొయిల్లా గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. ముగ్గురుని స్థానికులు రక్షించారు. మిగిలిన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. మొత్తం పదిమంది చిన్నారులు ఈతకు చెరువులోకి దిగగా ఆరుగురు మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి సంబంధించిన సూరజ్, అర్జున్, రాజా, సత్యం, బిట్టూ, చందన్‌గా గుర్తించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన పిల్లలు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.