ప్రధాని పదవిలో ఉంటూ చేయదగ్గ పనేనా ఇది…!!

ఫిన్‌లాండ్‌ ప్రధానమంత్రి సనా మారిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేసుకున్నారు.. అప్పట్నుంచి నెటిజన్లు అభ్యంతర వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు.. అమ్మాయి అయితే చాలు హితవచనాలు చెప్పడానికి ఎప్పుడూ రెడీగా ఉండే బ్యాచ్‌ కదా! అందుకే ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారని తెలిసీ ఆమెకు సుద్దులు చెప్పడం మొదలు పెట్టారు..34 ఏళ్ల సనా మారిన్‌ మొన్నీమధ్యన ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. కవర్‌ ఫోటో కోసం ఆమె లో కట్‌ నెక్‌లైన్‌ ఉన్న బ్లాక్‌ […]

ప్రధాని పదవిలో ఉంటూ చేయదగ్గ పనేనా ఇది...!!
Follow us

|

Updated on: Oct 17, 2020 | 10:23 AM

ఫిన్‌లాండ్‌ ప్రధానమంత్రి సనా మారిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్‌ చేసుకున్నారు.. అప్పట్నుంచి నెటిజన్లు అభ్యంతర వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు.. అమ్మాయి అయితే చాలు హితవచనాలు చెప్పడానికి ఎప్పుడూ రెడీగా ఉండే బ్యాచ్‌ కదా! అందుకే ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారని తెలిసీ ఆమెకు సుద్దులు చెప్పడం మొదలు పెట్టారు..34 ఏళ్ల సనా మారిన్‌ మొన్నీమధ్యన ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. కవర్‌ ఫోటో కోసం ఆమె లో కట్‌ నెక్‌లైన్‌ ఉన్న బ్లాక్‌ బ్లేజర్‌ను ధరించారు..ఆ ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.. దానికే కొందరు నెటిజన్లు క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టారు. అసలు మీరు ప్రధానమంత్రివా లేక మోడల్‌వా అంటూ ట్రోల్‌ చేయసాగారు.. ప్రధానమంత్రి లాంటి ఉన్నతమైన పదవిలో ఉన్నవారు చేసే పనేనా ఇది…! అసలు మీరు ప్రధానమంత్రా ? లేక మోడలా..? మీ విశ్వసనీయత క్షీణించింది అంటూ విమర్శించసాగారు.. ఇలాంటి కామెంట్లు చేసినవారంతా మగ పుంగవులేననుకోండి.. సనా మారిన్‌కు మద్దతు పలుకుతూ చాలా మందే వచ్చారు.. ట్రోల్స్‌ను తిప్పికొట్టసాగారు.. వారంతా అచ్చం ప్రధానమంత్రిలాంటి దుస్తులే ధరిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. వేసుకున్న దుస్తులు కాదు సాధించిన విజయాలు చూడాలని సూచించారు.. ప్రధానమంత్రికి మద్దతు పలుకుతూ చాలా మంది మహిళలు లో నెక్‌ బ్లేజర్‌ ధరించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయసాగారు..