Vijayasai Reddy : టీడీపీ మహానాడుకు ఈ రెండు పేర్లలో ఏదో ఒకటి పెట్టుకోండి…విజయసాయి సెటైర్లు

|

May 28, 2021 | 8:07 PM

మహానాడులో అరిగిపోయిన పాత రికార్డులు అపి - ఏదయినా పనికొచ్చే పనిచేయి బాబు. నీతో పొత్తు పెట్టుకుని వెన్నుపోటు పొడిపించుకునే పార్టీనో, మనిషినో చుస్కో..

Vijayasai Reddy  : టీడీపీ మహానాడుకు ఈ రెండు పేర్లలో ఏదో ఒకటి పెట్టుకోండి...విజయసాయి సెటైర్లు
Vijayasai Reddy
Follow us on

YSRCP MP Vijayasai Reddy slams Chandrababu : వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్టీఆర్ జయంతి వేళ టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు. “మహానాడులో అరిగిపోయిన పాత రికార్డులు అపి – ఏదయినా పనికొచ్చే పనిచేయి బాబు. నీతో పొత్తు పెట్టుకుని వెన్నుపోటు పొడిపించుకునే పార్టీనో, మనిషినో చుస్కో. కొత్తవారు దొరక్కపోతే పాత వారినే మళ్ళీ పొడువు. ఎంతకాలం హైదరాబాద్ నేనే కట్టాను, అమరావతి గ్రాఫిక్స్ చూపించాను అంటావ్?” అంటూ విజయసాయి వరుస ట్వీట్లలో చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. “మహానాడు మొదటి రోజే బంపర్ ఆఫర్ తగిలింది బాబుకి. ఓటుకు కోట్లు కేసులో ‘మన వాళ్లు బ్రీఫుడ్ మీ’ అన్న స్వరం ఆయనదేనని ఫోరెన్సిక్ ల్యాబులు ఇచ్చిన రిపోర్టును ఇడి ఛార్జిషీటులో జతపర్చింది. మళ్లీ స్టే కోసం పరుగెడతాడేమో. అత్యధిక స్టేలు పొందిన తుప్పు రికార్డు నీ పేరనే ఉంది బాబూ.” అంటూ మరో ట్వీట్లో విజయసాయి.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. “మనవాళ్ళు ‘బ్రీఫ్డ్ మీ’ వాయిస్ పెద్ద పచ్చ ఫంగస్ దే అని ED కూడా తేల్చేసింది. అడ్డంగా దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం బాబుకు ‘వెన్నుపోటు’తో పెట్టిన విద్య. 23 మంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను అలానే కొన్నాడు. చేసిన పాపాలు ఊరికేపోవు. ఇక దేభ్యం ముఖం వేసుకుని దిక్కులు చూడ్డమే బాబు పని.” అంటూ నిన్న ఓటుకు నోటు కేసులో ఈడీ సమర్పించిన చార్జి షీట్ నేపథ్యంలో విజయసాయి టీడీపీ మీద, చంద్రబాబు పైనా ఆరోపణలు గుప్పించారు.

“వైఎస్సార్ పంటల బీమా పథకంపై పడి ఏడుస్తాడు. రైతు భరోసా కింద డబ్బులిస్తే కేంద్ర నిధులంటాడు. కేంద్ర నిధులైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా చంద్రబాబూ? మహానాడులో అబద్ధాలు ప్రచారం చెయ్యడానికి సిగ్గులేదూ ? మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుంది.” అంటూ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో టీడీపీని, చంద్రబాబుని మరోసారి అపహాస్యం చేసే ప్రయత్నం చేశారు.