పోసానికి మంత్రి పదవి ఇవ్వనున్నారా..?

ఏపీ పొలిటికల్ స్కీన్ మీద ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. సినీ ఇండస్ట్రీ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలను పోసాని మురళీకృష్ణ ఖండించారు. ఆ తర్వాత పృథ్వీ వాటికి వివరణ కూడా ఇచ్చారు. అయితే ఈ వివరణ కేంద్రంగానే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ, ఇటు ఫిలింనగర్ లోనూ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీకి సపోర్టుగా ఉంటూ పార్టీలో చురుగ్గా వ్యవహరించిన […]

పోసానికి మంత్రి పదవి ఇవ్వనున్నారా..?

Edited By:

Updated on: Aug 06, 2019 | 8:29 PM

ఏపీ పొలిటికల్ స్కీన్ మీద ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. సినీ ఇండస్ట్రీ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలను పోసాని మురళీకృష్ణ ఖండించారు. ఆ తర్వాత పృథ్వీ వాటికి వివరణ కూడా ఇచ్చారు. అయితే ఈ వివరణ కేంద్రంగానే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ, ఇటు ఫిలింనగర్ లోనూ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీకి సపోర్టుగా ఉంటూ పార్టీలో చురుగ్గా వ్యవహరించిన పృథ్వీని జగన్ SVBC చైర్మన్ ను చేశారు. ఎన్నికలకు కాస్త ముందు పార్టీలో చేరిన ఆలీకి FDC చైర్మన్ ఖరారు చేసేశారు. మరి మొదటి నుంచి పార్టీకి గట్టి సపోర్టు ఇస్తూ వచ్చిన పోసానికి ఏ పదవినీ ఇవ్వలేదు. ఇప్పుడు పోసానిని ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేస్తారా.. లేదా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇచ్చి…రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లోకి తీసుకుంటారా? అనే ప్రశ్నలు వైసీపీలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి సీఎం జగన్ ఏం సమాధానం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us