TRS Vs BJP: తెలంగాణలో యూపీ ఎన్నికల వేడి.. మంత్రి కేటీఆర్-బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య మాటల యుద్ధం..

|

Feb 16, 2022 | 11:51 AM

యూపీలో ఎన్నికలు జరుగుతుంటే ఆ వేడి మొత్తం తెలంగాణలో కనిపిస్తోంది. అక్కడి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్‌లు ఇస్తుంటే.. మంత్రి కేటీఆర్‌ మాత్రం ఆ హీట్‌పై నీళ్లు చల్లుతున్నారు.

TRS Vs BJP: తెలంగాణలో యూపీ ఎన్నికల వేడి.. మంత్రి కేటీఆర్-బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య మాటల యుద్ధం..
Minister Ktr Vs Bjp Mla Raj
Follow us on

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(UP Elections) విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Raja Singh) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో చర్చ మొదలైంది. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్(Minister KTR) సెటైర్లు సంధిస్తే.. అదే అంశంపై రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఉత్తర ప్రదేశ్ ఓటర్లకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డైరెక్ట్ వార్నింగ్ అందులో ఉంది. బీజేపీకి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తాం.. వాళ్ల ఇళ్లను జేసీబీలు, బుల్‌డోజర్లతో తొక్కిస్తామన్నారు. హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన రాజాసింగ్‌.. వచ్చేది యోగి బాబా ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. రాజాసింగ్‌ సెన్షేషనల్ కామెంట్స్ చేస్తే.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మాత్రం ఆయనను ఓ కమెడియన్‌గా అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ వాళ్లు ఇంతకుమించి దిగజారలేరని అనుకున్నప్పుడు.. మరో అద్భుతమైన హాస్యనటుడు కనిపించాడని సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్.

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కి మళ్లీ బదులిచ్చారు రాజాసింగ్‌. బరాబర్‌ యూపీలో దేశద్రోహులపైకి బుల్‌డోజర్‌ ఎక్కిస్తామని కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు.

యూపీలో ఎన్నికలు జరుగుతుంటే ఆ వేడి మొత్తం తెలంగాణలో కనిపిస్తోంది. అక్కడి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్‌లు ఇస్తుంటే.. మంత్రి కేటీఆర్‌ మాత్రం ఆ హీట్‌పై నీళ్లు చల్లుతున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్‌లో మాటల యుద్ధం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్‌ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?