Revanth : టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్ రెడ్డి వరస పర్యటనలు, ఈనెల 7న బాధ్యతలు తీసుకోబోతున్న వేళ వడివడి అడుగులు

|

Jul 05, 2021 | 9:53 PM

ఈనెల 7వ తేదీన పీసీసీగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోబోతున్నారు. పార్టీని పరుగులు పెట్టించి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు...

Revanth : టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్ రెడ్డి వరస పర్యటనలు, ఈనెల 7న బాధ్యతలు తీసుకోబోతున్న వేళ వడివడి అడుగులు
Revanth Reddy
Follow us on

Revanth Reddy : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్ రెడ్డి వరస పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలను కలిసి మద్ధతు కూడగట్టుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలనే కాకుండా.. జాతీయ స్థాయి నాయకులను కూడా కలిసే పనిలో పడ్డారు రేవంత్. ఈ క్రమంలోనే రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే.. కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్‌ను కలిశారు. బెంగుళూరులో.. వారి మర్యాదపూర్వక సమావేశం జరిగింది. తనను పీసీసీగా ప్రకటించిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను.. వారికి వివరించారు రేవంత్ రెడ్డి.

పదవి అంటే అలంకారం కాదు.. బాధ్యత. తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్.. రేవంత్ రెడ్డి కూడా ఇదే కరెక్ట్ రూట్ లో వెళ్తున్నారు. లోకలే కాదు నాన్ లోకల్ లీడర్లనూ కలుస్తున్నారు. ఈనెల 7వ తేదీన పీసీసీగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోబోతున్నారు. పార్టీని పరుగులు పెట్టించి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఆయన దూసుకుపోతున్నారు. గాంధీభవన్ వాస్తు నుంచే ఆయన మార్పులు మొదలు పెట్టారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి.

మరోవైపు పార్టీలో సీనియర్లను బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే చాలా పెద్ద బాధ్యత. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లడమే కాకుండా.. సీనియర్లు, జూనియర్లను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంటుంది. ఈ దిశగా ముందుకు సాగుతున్నారు రేవంత్. ఇప్పటికే పార్టీ నేతలను ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Read also: Errabelli Dayakar Rao : గ్రామాభివృద్దితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు