ఇక నందిగ్రామ్ రణక్షేత్రంలో హోరాహోరీ పోరు, నామినేషన్ దాఖలు చేసిన దీదీ

| Edited By: Anil kumar poka

Mar 10, 2021 | 3:07 PM

బెంగాల్ సీఎం, తుణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ బుధవారం నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వస్తుండగా టీఎంసి నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు   'ఖేలా హోబ్' అంటూ నినాదాలు చేశారు. 

ఇక నందిగ్రామ్ రణక్షేత్రంలో హోరాహోరీ పోరు, నామినేషన్ దాఖలు చేసిన దీదీ
Follow us on

బెంగాల్ సీఎం, తుణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ బుధవారం నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వస్తుండగా టీఎంసి నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు   ‘ఖేలా హోబ్’ అంటూ నినాదాలు చేశారు.  నామినేషన్ దాఖలుకు ముందు మమత.. ఇక్కడి మహారుద్ర సిధార్థ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె ఆలయంలోకి ప్రవేశించేముందు పెద్ద సంఖ్యలో మహిళలు శంఖం ఊదుతూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. మరోవైపు దీదీ ఈ నియోజకవర్గంలో ఓ రోడ్డు పక్కన టీ స్టాల్ వద్ద నిలబడి కస్టమర్లకు టీ తయారు చేసి ఇవ్వడం విశేషం. దాంతో ఆ స్టాల్ యజమాని ఆశ్చర్యపోయాడు.

మమత నిన్న కూడా ఇక్కడి కొన్ని గుడులను సందర్శించి చండీపథ్ ప్రవచనాలను ప్రస్తావించారు.  ఇలా ఉండగా నందిగ్రామ్ లోని కొన్ని ఆలయాల్లో బీజేపీ గుర్తులతో, ఆ పార్టీ నేతల ఫొటోలతో కూడిన బాక్సులను, అగ్గిపెట్టెలను కొంతమంది..భక్తులకు అందజేసినట్టు తమకు  తెలిసిందని టీఎంసీ కార్యకర్తలు బెంగాల్ చీఫ్ ఎలెక్టోరల్  ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి నుంచే బీజేపీ.. ఇలాంటి అనుచిత ఎత్తుగడలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.

నందిగ్రామ్ నుంచి బీజేపీ నేత సువెందు అధికారి… మమత పై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 12 న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సువెందు తరఫున మిథున్ చక్రవర్తి, ఇతర ప్రముఖ నేతలు ప్రచారం చేయనున్నారు.మమత చండీపథ్ ప్రవచనాలను తప్పుగా ప్రస్తావించారంటూ సువెందు అధికారి తన ఫోన్ లో రికార్డు చేసిన వాటిని మైక్ ద్వారా ప్రజలకు వినిపించడం గమనార్హం. ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్దీ,  ప్రధాన పార్టీల మధ్య ఈ విధమైన చిత్ర, విచిత్రాలను ఓటర్లు, ఈ దేశ ప్రజలు చూడనున్నారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

AP Municipal Elections 2021 : పోలీసులు వారించినా క్యూలో నిల్చునే ఓటుహక్కు వినియోగించుకున్న అఖిలప్రియ, పోలీసు అధికారిని తోసేసిన కొల్లు

Kumbh Mela 2021: కుంభమేళాకు హరిద్వార్‌లో ఏర్పాట్లు పూర్తి.. భారీగా తరలివస్తున్న భక్తులు