టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి చల్లా..?

ఇప్పటికే వరుస షాక్‌ల్లో సతమతమవుతోన్న టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూల్ జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అలాగే రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్‌ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం చంద్రబాబునాయుడుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన అందులో తెలిపారు. కాగా టీడీపీ తరపున కర్నూల్ జిల్లాలోని ఏదైనా […]

టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి చల్లా..?

Edited By:

Updated on: Mar 06, 2019 | 7:25 PM

ఇప్పటికే వరుస షాక్‌ల్లో సతమతమవుతోన్న టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూల్ జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అలాగే రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్‌ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం చంద్రబాబునాయుడుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన అందులో తెలిపారు.

కాగా టీడీపీ తరపున కర్నూల్ జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చల్లా భావించారు. అయితే ఇప్పుడు ఆ అవకాశాలేవి కనిపించకపోవడంతో ఆయన పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. ఇక చల్లా త్వరలోనే వైసీపీలో చేరనున్నాడని.. ఈ విషయాన్ని తన ముఖ్య అనుచరులకు స్పష్టం చేశారని తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us