ఏపీలో ఎస్‌ఈసీ వర్సెస్‌ సీఎస్‌.. గుంటూరు, చిత్తూరు కలెక్టర్ల నియామకాలపై నెలకొన్న ఉత్కంఠ

|

Feb 01, 2021 | 12:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య విబేధాలు తగ్గడం లేదు. ఎన్నికల నిర్వహణపై నెలకొన్న..

ఏపీలో ఎస్‌ఈసీ వర్సెస్‌ సీఎస్‌.. గుంటూరు, చిత్తూరు కలెక్టర్ల నియామకాలపై నెలకొన్న ఉత్కంఠ
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య విబేధాలు తగ్గడం లేదు. ఎన్నికల నిర్వహణపై నెలకొన్న వివాదం.. అధికారుల బదిలీల వరకూ వెళ్లింది. తాజాగా గుంటూరు, చిత్తూరు కలెక్టర్ల నియామకాలపై కూడా వివాదం చెలరేగుతోంది. చిత్తూరు కలెక్టర్‌గా హరినారాయణ, గుంటూరు కలెక్టర్‌గా బసంత్‌కుమార్‌ను నియమించాలని ఎస్‌ఈసీ సూచించారు.

అయితే ప్రభుత్వం పంపిన ప్యానెల్‌లో హరినారాయణ, బసంత్‌కుమార్‌ పేర్లు లేవు. దాంతో చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. చిత్తూరు కలెక్టర్‌ కోసం జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్, ప్రద్యుమ్న, ఎం.ఎం.నాయక్‌, గుంటూరు కలెక్టర్‌ కోసం హెచ్‌.అరుణ్‌కుమార్, వివేక్‌యాదవ్, కార్తికేయ మిశ్రా పేర్లను పంపింది ప్రభుత్వం. దీనిపై కూడా ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య వార్‌ కొనసాగుతోంది.

మరోవైపు సీఎమ్‌వో కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌పై చర్యలకు ఏపీ సీఎస్‌ ఆధిత్యనాథ్‌ దాస్‌ నో చెప్పారు. ప్రవీణ్‌ప్రకాశ్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలో లేరని సీఎస్‌ స్పష్టం చేశారు. అందుకే ప్రవీణ్‌ప్రకాశ్‌పై చర్యలు తీసుకోలేమని ఎన్నికల కమిషన్‌కు తెలిపారు. అధికారులను సమావేశంలో పాల్గొనకుండా ప్రవీన్‌ప్రకాశ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రవీణ్‌ ప్రకాశ్‌ను బదిలీ చేయాలంటూ సీఎస్‌కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేశారు.

 

పంచాయతీరాజ్‌ శాఖపై నిమ్మగడ్డ మరోసారి సీరియస్‌.. ఆ విషయంపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశం