Somu Veerraju: మత్స్యకారులను పాలగాళ్ళెగా మార్చే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది: సోము వీర్రాజు

|

Sep 12, 2021 | 4:09 PM

రాష్ట్రంలో మత్స్యకారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే జీఓ నెం. 217 ను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు ఏపీ ముఖ్యమంత్రి

Somu Veerraju: మత్స్యకారులను పాలగాళ్ళెగా మార్చే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది: సోము వీర్రాజు
Somu Letter
Follow us on

AP Politics – AP BJP – Somu Veerraju: రాష్ట్రంలో మత్స్యకారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే జీఓ నెం. 217 ను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. జీవో తో లక్షలాది మత్స్యకార కుటుంబాల జీవితాలను గందరగోళంలోకి నెడుతున్నారన్న సోము వీర్రాజు.. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి 9 ప్రశ్నలతో కూడిన ఒక బహిరంగ లేఖ రాశారు. అంతరంగీకులకు, అనుచ రులకు కడుపు నింపేందుకే, జీవో తెచ్చారని సోము వీర్రాజు ఆరోపించారు.

ఈ ప్రభుత్వం మత్స్యకారులను పాలగాళ్ళెగా మార్చే, కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ఈ రాష్ట్రంలో ఎన్ని వందల, వేల కోట్ల రూపాయలు, ఏ పధకం ద్వారా, ఏ విధంగా.. ఎన్ని వచ్చాయి ఎలా ఖర్చు చేశారో “ఒక శ్వేతపత్రం” రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు.
s
“గత రెండు సంవత్సరాలుగా ప్రచారాలకు, పత్రికా ప్రకటనలకు పరిమితమైన పోర్టులు, చేపల వేటకు ఉపయోగించే జట్టీల నిర్మాణాలు ఎన్ని మొదలెట్టారు ? ఎన్ని ప్రారంభించారు ? ఎప్పటికి పూర్తి చేస్తారు ?
కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక మత్స్య మంత్రిత్వ శాఖను, ఏర్పాటు చేసి, తొలి బడ్జెట్లో 21′ రాష్ట్రాలకు గాను, రూ. 20 వేల కోట్లు కేటాయించిన సంగతి మరిచారు.” అని సోము వీర్రాజు ఏపీ సర్కారుని నిలదీసే ప్రయత్నం చేశారు.

జీఓ రద్దు కోరుతూ మత్స్యకారులను కలుపుకుని, రాష్ట్ర వ్యాప్తంగా మత్సకారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా పోరాటం చేస్తామని సీఎం జగన్ కు రాసిన లేఖ ద్వారా సోము వీర్రాజు హెచ్చరించారు.

Read also: Komatireddy: కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు న‌డుం బిగించాలి: ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి