మరో గ్రహశకలాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఉసేన్ బోల్ట్ స్పీడ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. భూమి చుట్టూ ఎంత వేగమంటే..

|

Aug 25, 2021 | 10:08 PM

సౌర వ్యవస్థలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, గ్రహశకలాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రహాలు, గ్రహశకలాల గురించి శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియవు. తాజాగా సెర్రో టోలలో ఇంటర్ అమెరికల్ అబ్జర్వేటరీ CTIO) విక్టర్ M బ్లాంక్ టెలిస్కోప్‌పై అమర్చిన DECam 2021 PH27 అనే గ్రహశకలాన్ని కనుగొంది.

1 / 6
ఖగోళ శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థలో అత్యంత వేగంగా కక్ష్యలో ఉన్న గ్రహశకలం కనుగొన్నారు. ఈ గ్రహశకలం కేవలం 113 భూమి రోజుల్లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దీనికి 2021 PH27 అని పేరు పెట్టారు. ఈ గ్రహశకలం చిలీలోని 'డార్క్ ఎనర్జీ కెమెరా' (DECam) ద్వారా కనుగొంది. మరికొంత మంది శాస్త్రవేత్తలు  దీనికి ఉసేన్ బోల్ట్ ఆఫ్ ఆస్టరాయిడ్ అని పేరు పెట్టారు

2 / 6
చిలీలోని సెర్రో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీ (CTIO) వద్ద విక్టర్ M బ్లాంక్ టెలిస్కోప్‌పై మౌంట్ చేయబడిన DECam గ్రహశకలంపై డేటాను సేకరించింది. అదే సమయంలో కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ యొక్క స్కాట్ ఎస్ షెపర్డ్ ఈ డేటాను వెతుకుతున్నప్పుడు ఈ గ్రహశకలం కనుగొన్నారు.

3 / 6
ఈ గ్రహశకలం చిత్రాలు మొట్టమొదటిసారిగా ఆగస్టు 13న బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ఇయాన్ డెల్ ఆంటోనియో, షెన్‌మింగ్ ఫూ ద్వారా కనుగొన్నారు. 2021 PH27 యొక్క కక్ష్య మార్గం చాలా చిన్నది. ఇది మన సౌర వ్యవస్థలో ఒక ఉల్క యొక్క అతి తక్కువ సగటు దూరం.

4 / 6
ఈ గ్రహశకలం సూర్యుడి గురుత్వాకర్షణ క్షేత్రానికి చాలా దగ్గరగా ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. దీని కారణంగా సౌర వ్యవస్థలోని ఏదైనా వస్తువుతో పోలిస్తే ఇది చాలా 'సాధారణ సాపేక్షత ప్రభావాన్ని' అనుభవిస్తుంది.

5 / 6
 విశ్వంలోని గ్రహం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహశకలాలు చాలా ముఖ్యమైనవి. వీటి ద్వారా భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల కోసం అనేక ముఖ్యమైన ఖనిజాలను కూడా కనుగొనవచ్చు. ఉదాహరణకు  వ్యోమగాములు ఉపయోగించగల బెన్నూ అనే గ్రహశకలంపై నీరు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.

6 / 6
 గ్రహశకలాల అధ్యయనం కూడా అవసరం. వీటి ద్వారా అవి భూమిని ఢీకొనే అవకాశాన్ని నిర్ధారించగలవు. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు భూమిని తాకిన గ్రహశకలాల శోధనలో నిమగ్నమై ఉన్నాయి.