సగం ఫ్రాన్స్‏లో.. సగం స్విట్జర్లాండ్‏లో ఉన్న హోటల్… దాని గురించి షాకింగ్ విషయాలు మీకోసం..

|

Nov 18, 2021 | 7:59 PM

ఈ ప్రపంచంలో అనేక అద్భుతాలు.. రహస్యాలు.. ఇప్పటికీ అంతుచిక్కని చిక్కుప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్నో అద్భుతాలున్నాయి.

1 / 6
అర్బెజ్ ఫ్రాంకో-సుయిస్సే హోటల్. ఇది సగం ప్రాన్స్‏లో.. సగం స్విట్జర్లాండ్‏లో ఉంది. ఇది ప్రపంచంలోనే వింతైన హోటల్. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫ్రాన్స్‌ను ఆక్రమించినప్పుడు, ఆ సమయంలో ఫ్రెంచ్ సైనికులు అదే భాగానికి వెళ్లేందుకు అనుమతించారు. ఎందుకంటే హోటల్‌లో కొంత భాగం స్విట్జర్లాండ్‌లో కూడా ఉంది.

2 / 6
అర్బేజ్ హోటల్లో ఉంటే... మీరు రెండు దేశాల్లో ఒకేసారి నివసించిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ హోటల్లో బస చేసి.. నిద్రించినవారు.. ఒకే సమయంలో రెండు దేశాల్లో నిద్రించినవారవుతారు.

3 / 6
ఈ హోటల్ దాదాపు 125 ఏళ్ల నాటిది. ఇది ఫైవ్ స్టార్ హోటల్ కాదు.. కానీ 2-స్టార్ కేటగిరీ హోటల్. ఇక్కడ బస చేసేందుకు అనేక దేశాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇక్కడకి వచ్చిన పర్యాటకులను ముందుగా ఏ దేశ సంస్కృతిని ఆస్వాదించాలనుకుంటున్నారు అని అడుగుతారు..అందుకు తగినట్టుగానే ఆ దేశ సౌకర్యాలను అందచేస్తారు.

4 / 6
ఈ హోటల్‌లోని కొన్ని గదులు నిద్రలో ఉన్నప్పుడు ఒక దేశం నుండి మరొక దేశానికి చేరుకునేలా ఉన్నాయి. ఆ గదులలోని పడకలు రెండు దేశాల సరిహద్దు రేఖకు మధ్యలో ఉంటాయి. సగం మంచం ఫ్రాన్స్‌లో.. సగం స్విట్జర్లాండ్‌లో ఉంటుందన్నమాట. ఒక జంట ఈ మంచంపై నిద్రిస్తే.. ఒకరు ఫ్రాన్స్, మరొకరు స్విట్జర్లాండ్ లో నిద్రించినట్లు.

5 / 6
ఈ హోటల్ సరిహద్దు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌తో ఉంది. దీంతో హోటల్ 2-2 చిరునామాలను కలిగి ఉంది. ఒక చిరునామా ఫ్రాన్స్ కాగా మరొకటి స్విట్జర్లాండ్. హోటల్ గదులు రెండు సమాన భాగాలుగా విభజించారు. ఇందులో సగం ఫ్రాన్స్‌లో, సగం స్విట్జర్లాండ్‌లో ఉండేలా ఈ గదులను అలంకరించారు.

6 / 6
రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫ్రాన్స్‌ను ఆక్రమించినప్పుడు, ఆ సమయంలో ఫ్రెంచ్ సైనికులు అదే భాగానికి వెళ్ళడానికి అనుమతించారు. ఎందుకంటే హోటల్‌లో కొంత భాగం స్విట్జర్లాండ్‌లో కూడా ఉంది. అయితే ఈ హోటల్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చే ప్రజలు రెండు దేశాల సంస్కృతిని ఆస్వాదిస్తారు.