ప్రపంచంలోనే వింతైన గ్రామం.. భూమి మీద కాదు.. భూమి కింద నివసిస్తారు.. వారి ఇంటి నిర్మాణం ఎలా ఉంటుందంటే..

|

Nov 27, 2021 | 8:41 PM

ప్రపంచంలో భూమి కింద చేసిన గుహల్లో మనుషులు నివసిస్తారు. ఈ గ్రామం గురించి 1969 వరకు ప్రపంచ ప్రజలకు తెలియదు. ఆ గ్రామం ఏంటీ.. ఎక్కడుందో తెలుసుకుందామా.

1 / 5
1969లో వచ్చిన వరదల కారణంగా భూగర్భంలో నిర్మించిన ఇళ్లు జలమయమయిన సమయంలో ఈ గ్రామ ప్రజలను గుర్తింటారు. దీంతో వెంటనే ఇక్కడి నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. ఆ తర్వాత అక్కడ నీటిని తొలగించిన తర్వాత తిరిగి వారు అదే ఇళ్లలో నివసించేందుకు వెళ్లారు.

2 / 5
ఈ గ్రామం ట్యునీషియా దక్షిణ భాగంలో ఉంది. ఈ గ్రామం పేరు మత్మత. భూమి కింద లోతైన గుహలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి దూరం చాలా దూరంగా ఉన్నాయి. ఈ గ్రామం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. స్టార్ వార్‌తో సహా ఇప్పటివరకు చాలా హాలీవుడ్ చిత్రాలను ఇక్కడ చిత్రీకరించారు.

3 / 5
ఈ ఇళ్లు మాకు చాలా ప్రత్యేకమైనవని.. విపరీతమైన చలి, మండే వేడి నుంచి తమను రక్షిస్తాయని అక్కడి గ్రామ ప్రజలు తెలిపారు. ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లడానికి వారు ఏమాత్రం ఇష్టపడడం లేదు. తమ సంప్రదాయాలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడడం లేదు. అలాగే ఇది తమకు సురక్షిత ప్రాంతమని తెలిపారు.

4 / 5
ఈ భూగర్భ ఇళ్లలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. విద్యుత్, టెలివిజన్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా.. వారు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే ఇళ్లలోకి చూస్తూ మాట్లాడతారు. ఇక ఇక్కడికి పర్యాటకులు పెరుగుతున్న సమయంలో ఇళ్లలోని కొన్ని భాగాలను హోటళ్లుగా మార్చుకున్నారు.

5 / 5
ఈ ఇంటిని వదిలి వెళ్లాలని లేదని తెలిపింది ఆ గ్రామంలోని 46 ఏళ్ల మోంజియా. ఆధునిక ఇళ్లు.. సౌకర్యాలు ఉన్నా కానీ..తనకు ఎక్కడా ప్రశాంతత దొరకదు అని తెలిపింది. ఇక్కడి ప్రజలు ఇదే విషయాన్ని విశ్వసిస్తారు. కానీ డబ్బు లేకపోవడంతో ఆధునిక ఇల్లు కొనలేని వారు కొందరున్నారు.