
హిందువులు పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ రోజున వినాయకుడిని భక్తితో పూజిస్తారు. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా ఘనంగ జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. మరి, ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా పండుగ ఎప్పుడు చేసుకోవాలా అని చాలా మందికి క్లారిటీ లేదు. ఈ గణేశ్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు. ఈ భాద్రపదమాసం వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ మాసంలో గణపతిని పూజిస్తూ ఉంటారు. భాద్రపద శుక్ల పక్ష చవితి సెప్టెంబర్ 14 ఉదయం 7:06 AM నుంచి సెప్టెంబర్ 15 ఉదయం 7:44 AM వరకు ఉండనుంది

2026 లో వినాయక చవితి పండుగను ఈ నెలలో భక్తుల రెండు రోజులు పండుగ చేసుకోనున్నారు. ఈ పండుగను అత్యంత శుభప్రదంగా కూడా హిందువులు భావిస్తారు. అయితే, చాలా మంది సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజున భక్తులు జరుపుకోనున్నారు. ఇప్పటి నుంచే బొమ్మలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.

అయితే, సెప్టెంబర్ 14 నుంచి వినాయక బొమ్మలను పెట్టి 11 రోజులు పూజలు చేస్తారు. అయితే, ఈ సారి సోమవారం రావడంతో వరుసగా మూడు రోజులు అంటే శని, ఆది, సోమవారం ఇలా మూడు రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 14 పండుగ చేసుకోలేని వాళ్ళు సెప్టెంబర్ 15 ఉదయం 7:44 AM వరకు తిథి ఉంది ఆ రోజు కూడా చేసుకోవచ్చు

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.