Gas Problem: తినకూడని ఆహారం లేదా, శరీరానికి సరిపడని ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో మంట, గ్యాస్ సమస్య ఎదురు కావడం శరామామూలే. అయితే ఆ సమయంలో మీరు మీ వంటగదిలోనే ఉన్న మసాలాది నుసులతో సమస్య నుంచి బయటపడవచ్చు.
వాము: గ్యాస్ సమస్య ఉన్నవారు దాన్ని కంట్రోల్ చేసేందుకు రోజుకు రెండు సార్లు వాము, ఉప్పు కలిపిన నీళ్లను తాగితే ఉపశమనం లభిస్తుంది.
పెరుగు: గ్యాస్ సమస్యకు పెరుగు చక్కని పరిష్కారం. ఇందుకోసం మీరు మీ ఆహారంలో పెరుగును మధ్యాహ్నం వేళలో తీసుకోండి. గ్యాస్‌తో పాటు అన్ని రకాల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
జీలకర్ర: గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయట పడేందుకు మీరు జీలకర్రను కూడా ఉపయోగించవచ్చు. అందుకోసం మీరు వేయించిన జీలకర్రను పొడిగా చేసుకుని వేడినీటితో తాగితే సరిపోతుంది.
దాల్చిన చెక్క: నేచురల్ యాంటియాసిడ్‌గా పనిచేసే దాల్చిన చెక్కతోనూ మీరు గ్యాస్ సమస్యకు చెక్ పెట్టేయవచ్చు. ఇందులోని గుణాలు, పోషకాలు జీర్ణాశయంలోని ఇన్ఫెక్షన్లను నయం చేయగలిగే ఈ మసాలా దినుసు మీ జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.