ప్రస్తుత కాలంలో సంబంధాలు చాలా బలహీనంగా మారుతున్నాయి. పార్టనర్స్ మధ్య మాటమాట పెరిగి బంధాలను తెంచుకునే వరకు వెళ్తున్నారు.. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు.. దాంపత్య జీవితంలో చిన్న గొడవలు, మనస్పర్థలు సర్వసాధారణం.. ఒక బంధం కలకాలం కొనసాగాలంటే.. ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్ధం చేసుకుని స్వభావం ఉండటం చాలా ముఖ్యం.. అయితే, రిలేషన్‌షిప్‌లో ఒకరి నుండి మరొకరు అంచనాలను కలిగి ఉండటం చాలా సాధారణం.. కానీ ఒకరి నుంచి మరొకరు అవాస్తవ అంచనాలను కలిగి ఉండటం సంబంధం బీటలు వారడానికి కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ భాగస్వామితో మాట్లాడటం.. ఈ అంచనాలను, వాస్తవ పరిస్థితులను పంచుకోవడం చాలా ముఖ్యం..
చాలా సార్లు ప్రజలు తమ అంచనాలు నెరవేరనప్పుడు బాధపడతారు. అదే సమయంలో, చాలా మంది తమ అంచనాలు నెరవేరనప్పుడు వారి భాగస్వామిని నిందిస్తారు.. వారితో గొడవలు ప్రారంభిస్తారు. ఇలా చేయడం ద్వారా, మీ సంబంధం క్షీణించడం ప్రారంభమవుతుంది. సంబంధంలో దూరం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇలాంటి తరుణంలో సంబంధంపై చెడు ప్రభావాన్ని చూపకముందే.. మీ మీ భాగస్వామితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి..
ఒకరితో ఒకరు సమయం గడపడం: చాలా మంది రిలేషన్ షిప్స్ లో చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, భాగస్వామి తన సమయాన్ని మనతోనే గడపాలని అనుకోవడం.. ఇలాంటి అంచనాతో.. మీ భాగస్వామి చిరాకు పడవచ్చు. అయితే, ఎల్లప్పుడూ అలా ఉండాలనుకోవడం చాలా తప్పు.. కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు.. వారిని అర్ధం చేసుకోవడం వల్ల సంబంధంలో సమతుల్యతను కాపాడవచ్చు..
ముఖ్యమైన అంశాలపై భిన్నాభిప్రాయాలు: మనం సరిగ్గా మనలాంటి వ్యక్తిత్వంతో ఉండాలనేది అపోహ. కొన్ని ముఖ్యమైన విషయాలపై సంబంధంలో భాగస్వాముల మధ్య విభేదాలు ఉండవచ్చు.. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వారి స్వంత అభిప్రాయాలను కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ అభిప్రాయాన్ని అవతలి వ్యక్తిపై విధించే బదులు గౌరవం, స్పష్టతతో పంచుకోవడం ముఖ్యం. ఇది మీ సంబంధంపై ఎలాంటి చెడు ప్రభావం చూపదు.
ప్రాధాన్యతలు: సంబంధాలలో వ్యక్తులు తరచుగా చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, భాగస్వామి మీకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఆశించడం. అయితే, ఏ వ్యక్తి జీవితంలోనైనా సంబంధం చాలా పెద్ద భాగం. కానీ కొన్నిసార్లు ఒక వ్యక్తికి సంబంధాల కంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి..
మైండ్ రీడింగ్ (ఊహించుకోవడం): మీరు ఏమి చెప్పకుండానే మీ భాగస్వామి మీకు ఏమి కావాలో, మీకు ఏమి అవసరమో, మీరు ఎందుకు కోపంగా లేదా విచారంగా ఉన్నారో అర్థం చేసుకుంటారని ఆశించడం సంబంధాన్ని విషపూరితం చేస్తుంది. కాబట్టి మీరు మీ సంబంధాన్ని కాపాడుకోవాలనుకుంటే, మీరు మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం.
చెడుగా అర్ధం చేసుకోవడం: భాగస్వాముల మధ్య తగాదాలు, గొడవలు లేకపోతే.. అది ఆదర్శవంతమైన సంబంధం అని అర్ధం కాదు.. అలానే.. గొడవలు ఉంటే.. బలహీనమైన సంబంధం అని కూడా కాదు.. అయితే, గొడవలు, ఘర్షణలు, మనస్పర్థల తర్వాత ఒకరినొకరు ఎలా ఒప్పించాలో, కలిసి ఎలా ముందుకు సాగాలో భాగస్వాములు తెలుసుకుంటే.. అది నిజమైన ఆదర్శ సంబంధం..