వింత ఆచారం.. వర్షాల కోసం గాడిదలకు పెళ్లి చేసి భోజనాలు పెట్టిన గ్రామస్తులు

Edited By:

Updated on: Aug 26, 2026 | 8:25 PM

వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. తెలుగురాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురువడం లేదు. దీంతో వర్షాలు లేక చాలా గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ కరువు పరిస్థితి చూసి తట్టుకోలేక రైతులు పురాతన ఆచారాలను పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలోని పాల్తూరులో రైతులు వర్షాల కోసం గాడిదలకు వివాహం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా గాడిదలకు పూజలు చేస్తూ వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని స్థానిక ప్రజల ప్రగాడ నమ్మకం.

1 / 5
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో వర్షం కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. గాడిదలకు పెళ్లి చేసి వాటిని ఊరంతా ఉరేగించారు.అనంతం వాటిని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇలా చేయడం వల్ల వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయని స్థానిక ప్రజల ప్రగాడ నమ్మకం.

2 / 5
కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవనప్పుడు గాడిదలకు పెళ్లి చేసి పూజించే వింత ఆచారం ఈ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో వానదేవుడు ముఖం చాటేయడంతో గ్రామస్తులందరూ ఎప్పటి నుంచో పాటిస్తున్న ఈ వింత ఆచారాన్ని మరోసారి నిర్వహించారు.

3 / 5
గ్రామంలోని శంకేరేశ్వర స్వామి దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కుకొని గాడిదలకు ఈ పెళ్లి తంతును నిర్వహించారు. వర్షాలు పడక కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు, వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. గ్రామంలో మనుషుల పెళ్లిలాగే గాడిదల పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేసారు.

4 / 5
డప్పు వాయిద్యాలతో గాడిదలను ఊరేగింపుగా తీసుకొచ్చి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి, గాడిదలపై పసుపు నీళ్లు చల్లుతారు. వివాహానికి సిద్ధం చేసిన గాడిదలకు పసుపు, కుంకుమతో బొట్టు పెట్టి.. పూలతో అలంకరించి పూజ చేశారు. అచ్చం మనుషులకు చేసే పెళ్లి తంతులో మాదిరిగా ఒడి బియ్యం పెట్టారు. దండలు కూడా మార్చి  తాళి కట్టించి అక్షింతలు వేసి గాడిదలను ఆశీర్వదించారు.

5 / 5
అనంతరం పెళ్లి చేసిన గాడిదలను గ్రామస్తులందరూ ఊరేగింపుగా గ్రామంలో తీసుకెళ్లారు. తర్వాత గ్రామస్తులు అందరూ కలిసి పెళ్లి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని నమ్మకంతో ఈ ఆచారాలను పాటిస్తున్నామంటున్నారు గ్రామస్తులు. ఈ వింత ఆచారానికి సంబంధించిన ఫోటోలో, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us